కరోనా మన జీవితాల్లో భాగంగా ఉండిపోతుందా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులకు ఇదే నిదర్శనమా?

కరోనా మన జీవితాల్లో భాగం కానుందా? ఈ మహమ్మారితో కలిసి జీవించాల్సిందేనా? దీనికి అంతం లేదా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులు..పెరుగుతున్న మరణాలు దీనికి నిదర్శనమా?..

10TV Telugu News

coronavirus delta wave may peak soon in us : మెరికాలో క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన డెల్టా వేరియంట్ బెంబేలెత్తిస్తోంది. లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండ‌రాదు అని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో వైర‌స్ మ‌న జీవితాల్లో భాగం కానుందనే సంకేతాలనిచ్చారు. ఇప్ప‌టికే ప్ర‌తి రోజు సుమారు 1800 మంది మ‌ర‌ణిస్తున్నారు. తీవ్ర‌మైన కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో ఇంకా ల‌క్ష‌లాది మంది హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందుతున్నారు. జాన్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెష‌ర్ భ‌క్తి హ‌న్సోటి అమెరికాపై రిపోర్ట్ ఇచ్చారు. ఇండియా త‌ర‌హాలోనే అమెరికాలో కూడా డెల్టా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ప్రొఫెష‌ర్ హ‌న్సోటి తెలిపారు. ప‌శ్చిమ యూరోప్ దేశాల్లోనూ ఇదే ర‌క‌మైన ట్రెండ్ కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు.

Read more ; Corona : కరోనా వైరస్ కు ముగింపు లేనట్లేనా?!

టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినవారిలోనే ఎక్కువగా వ్యాధి తీవ్రత ఉందని డాక్టర్లు గుర్తించారు.దీంతో టీకాలు వేయించుకోవాలని పదే పదే నిపుణులు మొత్తుకుంటున్నా పెద్దగా ఫలితాలు కనిపించటంలేదు. దీంతో మరణాల సంఖ్య ఏమాత్రం నియంత్రణ కావటంలేదు. అభివృద్ధి చెందిందని చెప్పుకునే అమెరికాలో ఈనాటికి వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో ఎన్నో అనుమానాలు. వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెనుకాడుతున్నారు. దీంతో ప్రజలకు వ్యాక్సిన్లు వేయటం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.

గతంలో జరిగిన పెను ప్రమాదం గురించి గుర్తించకపోతే మరింత ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని హాప్ కిన్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ హాన్సోటీ అన్నారు. కరోనా వైరస్ లో కొత్త రకాలతో పాటు శీతాకాలం ప్రారంభం కావటంతో చల్లని వాతావరణం వల్ల ఇంటిలోపలే ఎక్కువగా ఉండాల్సి రావటంతో మరో ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు. శీతాకాలంలో వైరస్ గరిష్ట స్థాయికి చేరటం..మళ్లీ తగ్గటట వంటి పరిస్థితులు ఉన్నాయని కెనడాకు చెందిన వైరాలజిస్టు ఏజెలా తెలిపారు.

Read more : Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

ఇటువంటి పరిస్థితుల్లో జనాలు వ్యాక్సిన్లు వేయించుకోవటం తప్ప వేరే దారిలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం 12నుంచి ఎక్కువ వయస్సున్న వారు 63.1 శాతం మందికి టీకాలు అందాయని మొత్తం జనాభా పరంగా చూసుకుంటే అది కేవలం 54 శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం.అంటే అమెరికాలో టీకాలు సమృద్ధిగా ఉన్నా జనాలు మాత్రం వేయించుకోవటంలో వెనుకబడే ఉన్నారు. వైరస్ హాట్ స్పాట్స్ లలో ప్రజలు మాస్కులతో పాటు కోవిడ్ నిబందనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

కరోనా కొత్త రకాలుగా వెలుగులోకి వచ్చినా వాటిలో డెల్టా ప్రభావం తీవ్రంగానే ఉంది. రానున్న రోజుల్లో మ్యుటేషన్ల వల్ల కొత్త వేరియంట్లకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే టీకాలే వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని..రాబోయే రోజుల్లో పిల్లలకు టీకాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. కానీ ఈ వైరస్ ను పూర్తిగా నిర్మూలించటం సాధ్యం కాకపోవచ్చని..ఇది ఎండెమిక్ (వ్యాధి ఒక దేశం, ఒకే ప్రాంతానికి పరిమితవడం, ఓ మోస్తరు స్థాయిలో ఎప్పుటికీ ఉండిపోయే వ్యాధి)గా మారే అవకాశముందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ సోకిన వారిలో ఇది ఫ్లూ మాదిరిగా ఉందనీ తెలిపారు. కానీ దీనిపై స్పష్టమైన అభిప్రాయం మాత్రం లేదు.

Read more : Coronavirus : యువతకు కరోనా సోకినా.. ఊపిరితిత్తుల ముప్పు తక్కువే..!

ఏది ఏమైనా కరోనా నిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించి తీరాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాధి నియంత్రణకు వ్యాక్సిన్ వేయించుకోవటం ఎంత ముఖ్యమో..మాస్క్, శానిటైజేషన్ వంటి ఇతర నిబంధనలు పాటించటం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. ఏది ఏమైనా కరోనా పూర్తిగా అంతం అయిపోతుందనే విషయంపై ఎవ్వరూ స్పష్టత గానీ గ్యారంటీ గానీ ఇవ్వకపోవటం ప్రతీ ఒక్కరూ గమనించాల్సిన విషయం.కాబట్టి..ఎవరి పనులు వారు చేసుకుంటూనే జాగ్రత్తలు, నిబంధనలు పాటించాల్సి అవసరం చాలా చాలా ఉంది. కానీ కరోనా కంటే తీవ్రమైన వైరస్ లనే ఖతం చేసే మెడిసిన్స్ కనిపెట్టిన పరిశోధకలు ఈ కరోనా వైరస్ కూడా అంతమవ్వవచ్చు. కానీ టైమ్ కూడా పట్టవచ్చు అనే ఆశాభావం చాలా అవసరం. అప్పటి వరకూ వ్యాధి నియంత్రణకు జాగ్రత్తలు మాత్రం మానకూడదు.

కాగా..చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలా వ్యాపించిందో..ఇప్పుడు పలు రకాలుగా మారుతున్న ఈ కరోనా ఒక దేశం నుంచి పలు దేశాలకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులను..ప్రజల మూర్ఖత్వంతోనో లేదా మరే కారణాల వల్లో కంట్రోల్ చేయలేని స్థాయికి చేరుకుంటున్నారు. రోజుకు 1800మంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

10TV Telugu News