Coronavirus : యువతకు కరోనా సోకినా.. ఊపిరితిత్తుల ముప్పు తక్కువే..!

కరోనా మహమ్మారి సోకిన వారిలో చాలామంది ఊపిరితిత్తుల సమస్యలు ఎదురుకున్నారు. ఉపిరితిత్తులపైనే అధిక ప్రాభవం చూపుతుందని వైద్యులు వెల్లడించారు.

Coronavirus : యువతకు కరోనా సోకినా.. ఊపిరితిత్తుల ముప్పు తక్కువే..!

Coronavirus

Coronavirus : కరోనా మహమ్మారి సోకిన వారిలో చాలామంది ఊపిరితిత్తుల సమస్యలు ఎదురుకున్నారు. ఊపిరితిత్తులపైనే అధిక ప్రాభవం చూపుతుందని వైద్యులు వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే రెస్పిరేటరీ విభాగానికి చెందిన కొందరు దీనిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో కరోనా సోకిన యుక్తవయసు వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేలింది. కరోనా రాకముందు ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయో కరోనా బారినపడి కోలుకున్న తర్వాత అలాగే పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఇక ఈ అధ్యయనానికి చెందిన పరిశోధన పత్రాన్ని ఇటీవల యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంట‌ర్నేష‌న‌ల్ కాంగ్రెస్‌కు స‌మ‌ర్పించారు.

Read More : Corona Virus: ఒకే ఒక్క కరోనా కేసు.. లాక్డౌన్ విధించిన ప్రభుత్వం

ఈ అధ్యయనం ప్రకారం యువతి యువకుల్లో కరోనా సోకితే వారి ఊపిరితిత్తుల పాణితురుపై ఎటువంటి ప్రభావం పడదట… ఆస్తమా రోగుల ఉపిరితిత్తులపై కూడా పెద్దగా ప్రభువం చూపదని స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త డా. ఐడా మాగెన్ సెన్ తెలిపారు. కరోనా సోకిన సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల పనితీరులో మార్పు లేదని వెల్లడించారు. చిన్నారుల్లో కూడా ఊపిరితిత్తుల‌పై ఎలాంటి ప్ర‌తికూల‌ ప్ర‌భావం ఉండ‌ద‌ని మ‌రో కొత్త‌ అధ్య‌య‌నంలో వెల్ల‌డించారు. చిన్నారులు, యువ‌తీయువ‌కుల లంగ్స్‌పై క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఏమాత్రం ఉండ‌ద‌ని పేర్కొన్నారు.

Read More : Corona : కరోనా వైరస్ కు ముగింపు లేనట్లేనా?!

స్టాక్‌హోమ్‌లో 1994-1996 మధ్య జన్మించిన వారిపై ఓ అధ్యయనం చేశారు. సగటు వయసు 22 ఏండ్లు వారిపై ఈ పరిశోధనలు జరగ్గా అందరిలోను ఊపిరితిత్తుల పనితీరు మునుపటిలాగానే ఉందని తేలింది. కాగా ఈ అధ్యయనం కోవిడ్ కు ముందే ప్రారంభమైంది. 2016 నుంచి 2019 వరకు పరిశోధన జరిగింది. వీరిపై రకరకాల పరీక్షలు చేశారు. ఆ తర్వాత 2020 అక్టోబర్ నుంచి 2021 మే నెల వరకు 661 మందిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో ఊపిరితిత్తులపై ప్రభావం పడలేదని నిర్ధారించారు. 178 మంది రక్తంలో సార్స్ కొవ్ – 2 వ్యతిరేక యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు గుర్తించారు.