Corona Virus: ఒకే ఒక్క కరోనా కేసు.. లాక్డౌన్ విధించిన ప్రభుత్వం

ప్రపంచంలో కరోనా వైరస్ సంక్రమణ ముప్పు ఇంకా తగ్గలేదు. భారతదేశం వంటి దేశాలలో, కరోనా వైరస్ సంక్రమణ వేగం తగ్గినప్పటికీ, అమెరికా వంటి దేశాలలో పరిస్థితి మాత్రం ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు

Corona Virus: ఒకే ఒక్క కరోనా కేసు.. లాక్డౌన్ విధించిన ప్రభుత్వం

Corona (3)

Corona Virus: ప్రపంచంలో కరోనా వైరస్ సంక్రమణ ముప్పు ఇంకా తగ్గలేదు. భారతదేశం వంటి దేశాలలో, కరోనా వైరస్ సంక్రమణ వేగం తగ్గినప్పటికీ, అమెరికా వంటి దేశాలలో, పరిస్థితి మాత్రం ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. అమెరికాతో పాటుగా, అనేక ఐరోపా దేశాలలో కూడా కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారిని అధిగమించడానికి అనేక దేశాలు ఇంకా కూడా లాక్‌డౌన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్నీ దేశాలు వేగవంతం చెయ్యగా.. కరోనా వైరస్ నియంత్రణ కోసం లాక్‌డౌన్ విధించిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా చేరింది.

కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కేసు ఆగస్టు 12న ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో నివేదించగా.. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. రాజధానిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక కరోనా కేసు రావడంతో లాక్డౌన్ విధించాలని నిర్ణయించిన మొదటి దేశం ఆస్ట్రేలియా అంటున్నారు. రాజధాని కాన్బెర్రాలో ప్రస్తుతం 22 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అటువంటి పరిస్థితిలో, లాక్డౌన్ అక్టోబర్ 15 వరకు పొడిగించింది ప్రభుత్వం.

ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ ముఖ్యమంత్రి ఆండ్రూ బార్ కాన్బెర్రా లాక్ డౌన్ అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చాలా వరకు విజయం సాధించింది. కాన్బెర్రాలో డెల్టా కేసులు రాకముందు, జూలై 10, 2020 నుంచి 4లక్షల 30వేల మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఒక కరోనావైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కేసు కూడా నమోదు కాలేదు. మొదటి కేసు తెరపైకి వచ్చిన వెంటనే ఇక్కడ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించడానికి కారణం కూడా ఇదే కావచ్చు.

అమెరికా, బ్రెజిల్, రష్యా మొదలైన దేశాలలో ప్రతిరోజూ వేలకొలది కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదవుతున్నాయి, అయితే ఇక్కడి ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాలని నిర్ణయించలేదు. భారతదేశంలో కూడా, చాలా కాలంగా, దాదాపు 30 వేల కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 25 వేలకు పైగా (25,404) కేసులు నమోదయ్యాయి.