Telugu states : ఒకే రోజు..తెలుగు రాష్ట్రాల కేబినెట్ మీటింగ్

ఏపీ కేబినెట్‌, తెలంగాణ కేబినెట్‌ విడివిడిగా సమావేశం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల మంత్రిమండలిలు ఒకేరోజు భేటీ అవడం ప్రాధాన్యత సంచరించుకున్నాయి.

10TV Telugu News

Telugu State Cabinet : ఏపీ కేబినెట్‌, తెలంగాణ కేబినెట్‌ విడివిడిగా సమావేశం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల మంత్రిమండలిలు ఒకేరోజు భేటీ అవడం ప్రాధాన్యత సంచరించుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు.. రెండు రాష్ట్రాల మధ్య  జలజగడం.. మహిళలపై జరుగుతున్న నేరాలపై చర్చించనున్నట్టు సమాచారం. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు  వారం రోజుల పాటు  నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.  అసెంబ్లీ సమావేశాల ఎజెండాతో  తేదీలను ఖారరు చేయనుంది కేబినెట్‌.

Read More : TTD : తిరుమల నూతన పాలకమండలి..సభ్యుల జాబితా ఇదే

ఉభయ సభల్లో ప్రతి పక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై సరైన సమాధానం ఇచ్చేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీలో దళిత బంధు అమలుపై ఒకరోజంతా చర్చ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న 17 లక్షల దళితులకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందో క్లుప్తంగా వివరించనున్నారు ముఖ్యమంత్రి.  ప్రతి ఏటా 20 వేల కోట్ల బడ్జెట్ పెట్టి సంవత్సరానికి 2 లక్షల మందికి దళిత బంధు పథకం వర్తించేలా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. జల వివాదం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. బాయిల్డ్‌ రైస్‌, ట్రిపుల్ వన్ జీవోతో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్‌పై కేబినెట్‌ డిస్కస్ చేయనుంది. ఆర్థికశాఖ ప్రతిపాదించిన పలు పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు యాదాద్రి ఆలయ పునః ప్రారంభంపై కూడా చర్చించే చాన్స్‌ ఉంది.

Read More : BJP-RSS: ఆర్ఎస్ఎస్, బీజేపీలు లక్ష్మీదేవి, దుర్గా మాతలపై దాడి చేశారు -రాహుల్ గాంధీ

అటు ఏపీ కేబినెట్‌ కూడా గురువారం సమావేశం కానుంది. ఈ నెలాఖరులో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. ఈ నెల 23 నుంచి ఐదు లేదా 10  రోజుల లోపు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడం.. రోడ్ల మరమ్మతు, ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణపై కేబినెట్ చర్చించనుంది,

Read More : Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

ప్రధానంగా శాసన మండలి ఛైర్మెన్, డిప్యూటీ ఛైర్మెన్ లు షరీష్, రెడ్డి సుబ్రమణ్యం రిటైర్డ్‌ కావడంతో ఈ సమావేశాల్లో కొత్తవారిని ఎంపిక చేయనున్నారు. అటు తెలంగాణతో జల వివాదం, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయడంపై జరుగుతున్న నష్టంపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలపై ఏర్పడ్డ విభేదాలపైనా మంత్రి మండలి డిస్కస్ చేయనుంది.