Kerala Lovers : రెహమాన్‌-సజితా పెళ్లి చేసుకున్నారు

రెహమాన్ అనే వ్యక్తి ఎవరికి తెలియకుండా పదేళ్లపాటు ప్రియురాలిని తన ఇంట్లో పెట్టుకున్న విషయం గుర్తుందా? ఐదు నెలల క్రితం బయటకు వచ్చిన ఈ వార్త అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

Kerala Lovers : రెహమాన్‌-సజితా పెళ్లి చేసుకున్నారు

Kerala Lovers

Kerala Lovers : రెహమాన్ అనే వ్యక్తి ఎవరికి తెలియకుండా పదేళ్లపాటు ప్రియురాలిని తన ఇంట్లో పెట్టుకున్న విషయం గుర్తుందా? ఐదు నెలల క్రితం బయటకు వచ్చిన ఈ వార్త అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అంతకాలం ఇంట్లో ఎవరికి తెలియకుండా ఎలా దాచాడని అందరు ముక్కున వేలేసుకున్నారు. అయితే బుధవారం ఆ జంట పెళ్లి చేసుకుంది.

Read More : Telugu states : ఒకే రోజు..తెలుగు రాష్ట్రాల కేబినెట్ మీటింగ్

కేరళలోని పాలక్కాడ్ జిల్లా నేన్ మారా పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కాయలయంలో ప్రత్యేక పద్దతిలో రెహమాన్.. సజితా ఒక్కటయ్యారు. పాలక్కాడ్‌ జిల్లా అయిలూర్‌కు చెందిన రెహమాన్‌ తన ప్రియురాలిని తన ఇంటి ప్రాంగణంలోనే ఓ గదిలో పదేళ్లపాటు రహస్యంగా దాచిపెట్టాడు.

Read More : Palakkad (Kerala): పదేళ్లుగా ప్రియుడి గదిలో ప్రేయసి.. ఎవరికీ తెలియదు!

కొన్ని నెలల క్రితం బయటపడిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. చట్టవిరుద్ధంగా యువతిని నిర్బంధించాడంటూ కేరళ రాష్ట్ర మహిళా కమిషన్‌ అతడిపై కేసు పెట్టింది. కేసులు విచారణ అనంతరం బుధవారం ఇద్దరు ఒక్కటయ్యారు.