Bandi Sanjay Warning (Photo : Twitter)
Bandi Sanjay Warning : బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ తలుచుకుంటే మీరు రోడ్లపై తిరగలేరు అని హెచ్చరించారు. బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ ను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు బండి సంజయ్.
తెలంగాణ ప్రజలారా.. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? నిర్ణయించుకోండి అని బండి సంజయ్ అడిగారు. కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసు పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేసిన ఎమ్మెల్యేని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిందే అన్నారు. అందుకోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
Also Read : బీఆర్ఎస్ పై గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు.. గులాబీ ముఖ్య నేతలపై హస్తం సీనియర్ నేతలు పోటీ?
”పేరు వివేకానంద్. ఔరంగజేబు చేష్టలు. ఓట్లేయకుంటే దాడులు చేస్తామంటూ ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారా? బీజేపీ తలుచుకుంటే రోడ్లపై తిరగలేరు. మా సహనాన్ని చేతకానితనంగా భావించొద్దు. వివేకానంద్ ను అనర్హుడిగా ప్రకటించాల్సిందే. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ ను తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు.
ప్రజాస్వామ్యవాదులారా. బీఆర్ఎస్ గూండాయిజాన్ని ఇంకా భరిద్దామా? ఆలోచించండి. కమీషన్లు దండుకుని దాడులు చేసే బీఆర్ఎస్ కావాలా? ప్రజల పక్షాన పోరాడే బీజేపీ కావాలా? తెలంగాణ ప్రజలారా.. మీ తీర్పే ఫైనల్.. బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పండి. దాడులు చేస్తారనే సమాచారం ఉన్నా పోలీసులెందుకు చర్యలు తీసుకోలేదు? రిటైర్ అయిన అధికారులను సీఎంఓలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు?” అని బండి సంజయ్ ప్రశ్నించారు.
డిబేట్ లో రచ్చ రచ్చ.. కూన శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకున్న ఎమ్మెల్యే
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఓ టీవీ చానెల్ నిర్వహించిన బహిరంగ చర్చలో రచ్చ రచ్చ జరిగింది. నేతల మధ్య మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, బీజేపీ నేత కూన శ్రీశైలంగౌడ్ తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వివేకానంద్.. శ్రీశైలంగౌడ్ మీదకు దూసుకెళ్లారు. ఆయన గొంతు పట్టుకున్నారు. ఇదంతా లైవ్ లోనే జరిగింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Also Read : పెద్దపల్లి నియోజవకర్గంలో ఆ రికార్డును సాధిస్తారా?
ఈ ఘటన రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. నేతల తీరు ప్రజలను విస్మయానికి గురి చేసింది. వీళ్లసలు ప్రజాప్రతినిధులా? వీధి రౌడీలా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బూతులు తిట్టుకోవడం, ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఏంటి? అని మండిపడుతున్నారు. ఇలాంటి వారినా మనం ఓట్లు వేసుకుని ఎన్నుకున్నది అని వాపోతున్నారు.
కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్ధి @KunaSrisailam గారిపై దాడి హేయనీయం. ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. భౌతిక దాడులతో భయాందోళనలు సృష్టించి గెలవాలని చూస్తున్నారు.
ఖబడ్డార్ బీఆర్ఎస్ నేతల్లారా….బిజెపి తల్చుకుంటే మీరు రోడ్లపై తిరగలేరు. మా సహనాన్ని… pic.twitter.com/x9SrME2ws4— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 25, 2023