×
Ad

కొత్త ఏడాదిలో ఆశావహుల ఆశలు నెరవేరేనా? ఆ పదవుల కోసం కాంగ్రెస్‌ లీడర్లు వెయిటింగ్‌ ఇక్కడ

ప్రస్తుతం జిల్లా కమిటీలు, మండల అధ్యక్షుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది.

Revanth Reddy (Image Credit To Original Source)

  • నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు భర్తీ చేయనున్నారా?
  • పదవుల పంపకానికి హైకమాండ్ ముహూర్తం ఫిక్స్ చేసిందా?
  • సంక్రాంతి తర్వాత నేతలకు తీపి కబురు అందబోతోందా?

Congress Party: ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిపోయింది. ఇప్పటికీ క్యాబినెట్‌లో రెండు పోస్టులు..ఇంకా కొన్ని నామినేటెడ్‌ పదవులు..పార్టీ బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవుల కోసం హస్తం పార్టీ లీడర్లు ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు.

వాళ్లందరికీ న్యూఇయర్‌లో పదవులు కట్టబెట్టబోతోందట కాంగ్రెస్ అధిష్టానం. ఇక వాయిదాలు లేవు..ఆలస్యం చేస్తే బాగోదు..మున్సిపల్ ఎన్నికలలోపే అన్ని పోస్టులు ఫిలప్ చేయాలని భావిస్తున్నారట.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఏడాది కొత్త జోష్ రానుందట. న్యూఇయర్‌లో పదవుల పంపకం ఆల్‌మోస్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో..మిగిలిన కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారట.

ఈ సారి కచ్చితంగా భర్తీ చేస్తారా?
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఈ సారి కచ్చితంగా భర్తీ చేయాలని అనుకుంటున్నారట. కొత్త ఏడాదిలో సంక్రాంతి తర్వాత పదవులను భర్తీ చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారట. ప్రభుత్వంలోని కార్పొరేషన్ పదవులతో పాటు, పార్టీలో పెండింగ్‌లో ఉన్న పదవులను కూడా ఫిలప్ చేయబోతున్నారట.

పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్లు పూర్తికావడంతో నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. పెద్దఎత్తున ఆశావహులు పదవుల కోసం లాబీయింగ్ చేస్తుండటంతో ఎంపిక క్లిష్టంగా మారిందట. పార్టీ కోసం పనిచేసిన వాళ్లు..కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట.

ఈ విషయంలో ముందుగా కొన్ని ఎంపిక చేసిన పదవులను భర్తీ చేయాలని అనుకుంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నామినేటెడ్ పోస్టులపై కసరత్తు చేశారు. ఇప్పటికే 38 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇంకా 40 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మొదటగా 17 కార్పొరేషన్లను భర్తీ చేయాలని నిర్ణయించారు. కులాల వారీగా ఉన్న కార్పొరేషన్లను ఫిలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ పదవుల ఎంపిక కూడా కూడా పూర్తయ్యిందట.

Also Read: ఏపీలో పల్లె పోరు ఆలస్యానికి దారితీస్తున్న పరిస్థితులేంటి?

ఆయా కులాల కార్పొరేషన్ల విషయంలో..పార్టీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతల నుంచి అభిప్రాయం తీసుకొని డిసైడ్ చేశారట. కులాల కార్పొరేషన్లతో పాటు మరో ఐదు క్యాబినెట్ ర్యాంకు ఉన్న కార్పొరేషన్లను కూడా భర్తీ చేయనున్నారట. క్యాబినెట్ ర్యాంకు ఉన్న కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు..మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి ఇవ్వనున్నారట.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ల పోస్టులను కూడా భర్తీ చేస్తారట. డైరెక్టర్ల పోస్టుల కోసం ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేశారు. సెలెక్ట్‌ అయిన నేతలందరికీ సంక్రాంతి తర్వాత తీపి కబురు అందబోతోందట.

పార్టీలో పదవుల పందేరం
ఇక పార్టీలో కూడా పదవుల పందేరం కొనసాగుతోంది. ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ, డీసీసీల వంటి పోస్టులను భర్తీ చేశారు. ఇక మిగిలిన వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ల నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని సంక్రాంతి తర్వాత భర్తీ చేస్తారట.

ప్రస్తుతం జిల్లా కమిటీలు, మండల అధ్యక్షుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఇది పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర కమిటీలను భర్తీ చేస్తారట. ఎట్టకేలకు పవర్‌లోకి వచ్చి రెండేళ్లు అయిపోవడంతో..అన్ని పదవుల భర్తీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న క్యాబినెట్ విస్తరణ కూడా జరగనుందట. క్యాబినెట్‌లో పెండింగ్‌ ఉన్న రెండు పదవులతో పాటు..శాఖల ప్రక్షాళన ఉంటుందని అంటున్నారు. పదవులు దక్కే నేతలెవరనేది చూడాలి మరి.