Sanitizer: ఫ్రెండ్ తో గొడవపడి శానిటైజర్ తాగేసిన యువతి
ఫ్రెండ్ తో గొడవపడిన మహిళ మూడ్రోజుల తర్వాత శానిటైజర్ తాగి సూసైడ్ కు ప్రయత్నించింది. సోమవారం హాస్పిటల్ కు చేర్చి ట్రీట్మెంట్...

Sanitizer
Sanitizer: ఫ్రెండ్ తో గొడవపడిన మహిళ మూడ్రోజుల తర్వాత శానిటైజర్ తాగి సూసైడ్ కు ప్రయత్నించింది. సోమవారం హాస్పిటల్ కు చేర్చి ట్రీట్మెంట్ అందిస్తుండగానే చనిపోయింది. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దత్తాత్రేయనగర్ లో ఉండే కె.ప్రత్యూష ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది.
రెండేళ్లుగగా జగదీష్ అనే వ్యక్తితో ఫ్రెండ్ షిప్ లో ఉంది. వారిద్దరి మధ్య కొద్ది రోజుల క్రితం వాదన జరిగింది. అప్పటి నుంచి మాట్లాడుకోవడం లేదు. సోమవారం ఇంట్లోనే ఉన్న ప్రత్యూష శానటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబం సభ్యులు హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించేందుకు ప్రయత్నించారు.
సోమవారం మధ్యాహ్నం చికిత్స తీసుకుంటుండగానే మృతిచెందింది. పెట్ బషీరాబాద్ పోలీసులు కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.