World Biryani Day 2025: ఈ బిర్యానీలు రుచి చూడని జన్మెందుకు? ఎక్కడెక్కడ ఏయే బిర్యానీ దొరుకుతుంది?
భారత్ అంతటా, ఇతర దేశాల్లో కూడా ఈ బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది.

బిర్యానీ పేరు విన్న వెంటనే నోరూరుతుంది. హైదరాబాద్ బిర్యానీ, లక్నో బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం జూలై 7న ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. బిర్యానీ సంస్కృతి, చరిత్రను గుర్తు చేసుకోవడానికి, రుచులను ఆస్వాదించడానికి వరల్డ్ బిర్యానీ డేను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ బిర్యానీ అంటే మాంసాహారులందరికీ ఇష్టమే. కొంతమంది తక్కువ మసాలాలు ఉండే లక్నో బిర్యానీని ఇష్టపడతారు. మరికొందరికి బంగాళాదుంపలు అధికంగా ఉండే కోల్‌కతా బిర్యానీ అంటే ఇష్టం.
రుచి, మసాలా సరైన రీతిలో ఉండే హైదరాబాద్ బిర్యానీ ప్రజాదరణలో అగ్రస్థానం దక్కించుకుంది. ఈ హైదరాబాద్ బిర్యానీ చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైందన్న తేది కచ్చితంగా తెలియదు. అయితే, మొదటి నిజాం కాలం నుంచి ఈ బిర్యానీని తయారు చేస్తున్నారని చాలా మంది నమ్ముతారు.
ఇంకొక ప్రచార ప్రకారం.. హైదరాబాద్ బిర్యానీ దక్షిణ భారత్‌లో ప్రసిద్ధి చెందిన పులావ్ తయారీలో భాగంగా అభివృద్ధి చెందినట్టు చెబుతారు. పులావ్, పిలవ్, పిలాఫ్ దక్షిణ భారత్ పాటు దక్షిణాసియాలో ప్రజాదరణ పొందిన వంటకం. ఇందులో బియ్యాన్ని మాంసం, కూరగాయలు, మసాలాలతో ముద్దగా వండతారు. హైదరాబాద్ బిర్యానీకి జీఐ (భౌగోళిక గుర్తింపు) ట్యాగ్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Also Read: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జలపాతాలు.. ఈ వర్షాకాలంలో వెళ్తే ఉంటుంది సామిరంగా..
ఈ బిర్యానీలన్నీ ఫేమస్
హైదరాబాద్ బిర్యానీ: బాస్మతి రైస్, చికెన్ లేదా మటన్, ప్రత్యేకమైన మసాలాలతో తయారవుతుంది. భారత్ అంతటా, ఇతర దేశాల్లో కూడా ఈ బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు దీని రుచిని తప్పక ఆస్వాదిస్తారు.
సింధీ బిర్యానీ: సువాసనతో నిండిన ఈ బిర్యానీ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం నుంచి వచ్చిందని చెబుతారు. అన్నం, చికెన్, మటన్, టమాటా, బంగాళాదుంపలు, గ్రీన్ మిర్చి వాడతారు.
ఢిల్లీ బిర్యానీ: మొగల్ పాలన నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పాత ఢిల్లీ, నిజాముద్దీన్ ప్రాంతాల్లో అసలైన ఢిల్లీ బిర్యానీ రుచిని ఆస్వాదించవచ్చు.
తలశెరి బిర్యానీ: కేరళలోని మలబార్ ప్రాంతానికి చెందిన బిర్యానీ ఇది. ఈ బిర్యానీని కైమా రైస్, మాంసం, ప్రత్యేకమైన పదార్థాలతో తయారు చేస్తారు. దీని రుచి, ఆకృతి భిన్నంగా ఉంటుంది.
లక్నో బిర్యానీ: అవధ్ శైలిలో తయారయ్యే ఈ బిర్యానీ మితమైన మసాలాలతో ఉంటది. అవధ్ శైలికి చెందిన వారసత్వానికి చిహ్నంగా ఈ బిర్యానీ ప్రాచుర్యం పొందింది.
కోల్‌కతా బిర్యానీ: అన్నంలో తక్కువ మసాలా, చికెన్‌లో మసాలా ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. కొత్త వంటకాలను ఆస్వాదించాలనుకునే ఫుడ్ లవర్స్ కోల్‌కతా వెళ్లి ఈ బిర్యానీ రుచి చూసేందుకు ప్రయత్నించొచ్చు.