Yadadri Temple : యాదాద్రి వైభవాన్ని చాటేలా పునర్‌ నిర్మాణం

యాదాద్రి ఆలయం పునఃప్రారంభం తేదీని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందన్నారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నారు.

Yadadri temple re-opening : యాదాద్రి ఆలయం పునః ప్రారంభం తేదీని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని సీఎం వెల్లడించారు.

యాదాద్రి అభివృద్ధికి నాలుగైదేళ్ల క్రితం బీజం వేశామన్నారు కేసీఆర్‌. యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్‌ నిర్మాణం చేపట్టామన్నారు. చినజీయర్‌ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు జరగాయన్నారు. చినజీయర్‌స్వామి లక్ష్యాన్ని నిర్దేశించారని… ఆయన సూచనలతో సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చలు జరిపి పునర్‌ నిర్మాణం చేశామన్నారు.

Yadadri Temple : మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం.. గోపురం బంగారు తాపడానికి సీఎం కేసీఆర్ తొలి విరాళం

ఆధ్యాత్మిక సంపద ఉన్న ప్రాంతం తెలంగాణ అని కేసీఆర్‌ గుర్తు చేశారు. సమైక్య పాలనలో ఆధ్యాత్మిక అంశంలో కూడా నిరాదరణ జరిగిందన్నారు. గతంలో పుష్కరాలు కూడా తెలంగాణలో నిర్వహించలేదని విమర్శించారు. ఉద్యమ సమయంలో గోదావరి పుష్కర శోభ ప్రపంచానికి తెలియజేశామన్నారు.

ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరం అవుతుందని అన్నారు కేసీఆర్‌. దీన్ని ఆర్బీఐ నుంచి కొనుగోలు చేస్తామని అన్నారు. తమ కుటుంబం నుంచి కిలో 16 తులాలు సమకూరుస్తామని అన్నారు. అలాగే 1008 కుండలాలతో మహా సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

CM KCR : యాదాద్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. 125 కేజీల బంగారంతో తాపడం

దళితబంధు విషయంలో ఎవరూ చింతించాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్‌. ఉపఎన్నిక తర్వాత తన చేతుల మీదుగా దళితబంధు పంపిణీ చేస్తానని భరోసా ఇచ్చారు. దళిత బంధు ఆన్‌ గోయింగ్ స్కీమ్ అన్న కేసీఆర్.. ఎన్నికల సంఘం ఎన్నిరోజులు ఆపుతుందని ప్రశ్నించారు.

అంతకుముందు ఆలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు..పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత బాలాయంలో శ్రీలక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్నారు సీఎం. స్వామి వారికి ప్రత్యేక పూజల తర్వాత కేసీఆర్‌, మంత్రులకు అర్చకులు వేదాశీర్వచనం అందించారు.

ట్రెండింగ్ వార్తలు