సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం.. రెచ్చిపోయిన యువకులు.. వీడియో వైరల్

సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడ్ని నలుగురు యువకులు చితకబాదారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం.. రెచ్చిపోయిన యువకులు.. వీడియో వైరల్

Young boys Attacked to young boy

Updated On : July 12, 2024 / 1:19 PM IST

Suryapet District : సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడ్ని నలుగురు యువకులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా స్థానిక అంజలి స్కూల్ సమీపంలో ఓ యువకుడిపై నలుగురు యువకులు దాడి చేశారు. రాత్రి వేళ నడి రోడ్డుపై యువకుడి బట్టలువిప్పి చితక్కొట్టారు.

Also Read : బీచ్‌లో ఈతకొడుతూ 80కి.మీ సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి.. 37గంటల తరువాత ఏం జరిగిందంటే?

దాడికి పాల్పడిన యువకులు గంజా మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. వారించేందుకు ప్రయత్నించిన స్థానికులపైనా దాడికి ప్రయత్నించడంతో.. స్థానికులుసైతం చూస్తూ ఉండిపోయారు. అయితే, యువకుడిపై దాడిచేసిన వారిలో కొందరు గతంలో గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన వచ్చినట్లు సమాచారం. పాత ఘర్షణల నేపథ్యంలో యువకుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.