YS Sharmila Party : షర్మిల పార్టీ జెండా ఖరారు

దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల..తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా..పార్టీ జెండాను ఖరారు చేశారు. 70 శాతం పాలపిట్ట రంగు, 30 శాతం నీలం రంగుతో జెండాను రూపొందించారు.

Ys Sharmila Party Flag Is Finalized

YS Sharmila Party : దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల..తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా..పార్టీ జెండాను ఖరారు చేశారు. 70 శాతం పాలపిట్ట రంగు, 30 శాతం నీలం రంగుతో జెండాను రూపొందించారు. పాలపిట్ట రంగు మధ్యలో తెలంగాణ మ్యాప్ ఉండగా..అందులో వైఎస్ఆర్ ఫొటో ఉంది.

Read More : Woman Beats Groom With Slipper : కొడుకుని పెళ్లిపీటల మీద చెప్పుతో కొట్టిన తల్లి
దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున జూలై 08వ తేదీన షర్మిల పార్టీ (YSRTV) ఆవిర్భావం కాబోతున్న సంగతి తెలిసిందే. అదే రోజు 33 జిల్లాల వై.యస్.ఆర్ అభిమానులతో సమావేశం కానున్నారు. కొత్త పార్టీ నిర్మాణం కోసం గ్రామీణ, మండల, నియోజకవర్గ స్థాయిలో హడక్ కమిటీలు వేయనున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఏర్పాట్లపై చర్చిస్తారు. అభిమానులతో సమావేశం కొవిడ్ నిబంధనల ప్రకారమే జరగనుంది. పార్టీ పేరు ప్రకటన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ సమావేశంలో అడిగి తెలుసుకోనున్నారు షర్మిల.

అంతకుముందే…పార్టీ జెండాను ఖరారు చేసే విధంగా షర్మిల, పార్టీ పెద్దలు చర్చించారు. జెండా ఏ విధంగా ఉండాలి ? ప్రజలను ఆకట్టుకొనే విధంగా రూపొందించాలని భావించారు. తాజాగా..జెండాలో రెండు రంగులను ప్రధానంగా తీర్చిదిద్దారు. నీలి రంగు సమానత్వం, సౌభాతృత్వం..కొన్ని విషయాల్లో ఈ రంగు బాగుంటుందని…అలాగే..పాల పిట్ట రంగు..ఈ రంగు అట్రాక్టిగ్ ఉంటుందని భావించి పార్టీ జెండాను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల తన పార్టీకి వ్యూహకర్తను నియమించుకున్నారు. ప్రశాంత్ కిశోర్ టీమ్ లో కీలకంగా వ్యవహరించిన ప్రియను వ్యూహకర్తగా షర్మిల ఎంపిక చేసుకున్నారు.

Read More : Women Cheater Arrested : మహిళలను మోసం చేస్తున్నవ్యక్తి అరెస్ట్