YS Sharmila Padayatra : రంగంలోకి దిగాం..పాదయాత్ర చేస్తాం – షర్మిల

ప్రతిపక్షాలు, అధికారపక్షాలపై విమర్శలు చేసిన షర్మిల..పాదయాత్రపై కూడా ఓ ప్రకటన చేశారు. తాము కూడా రంగంలోకి దిగామని..ప్రజా సమస్యలపై కొట్లాడుతామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ..ప్రతి జిల్లా..గ్రామాలకు వెళుతామని, ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు.

YS Sharmila Padayatra : రంగంలోకి దిగాం..పాదయాత్ర చేస్తాం – షర్మిల

Gh

Updated On : July 8, 2021 / 8:02 PM IST

YS Sharmila Padayatra : తెలంగాణ రాష్ట్రంలో నేతలు పాదయాత్రకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలు పాదయాత్రలు చేయాలని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తాజాగా…రాష్ట్రంలో పార్టీని ప్రకటించిన షర్మిల కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2021, జూలై 08వ తేదీ గురువారం వైఎస్సార్ జయంతి రోజున..అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.

Read More : YS Sharmila News Party : అసెంబ్లీలో 50 శాతం మహిళలే..చేసి చూపిస్తాం – షర్మిల

ఈ సందర్భంగా పార్టీ లక్ష్యాలు, విధి, విధానాలను ప్రకటించారు. పలు కీలక ప్రకటనలు కూడా చేశారామె. ప్రతిపక్షాలు, అధికారపక్షాలపై విమర్శలు చేసిన షర్మిల..పాదయాత్రపై కూడా ఓ ప్రకటన చేశారు. తాము కూడా రంగంలోకి దిగామని..ప్రజా సమస్యలపై కొట్లాడుతామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ..ప్రతి జిల్లా..గ్రామాలకు వెళుతామని, ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ రోజు నుంచి సరిగ్గా వంద రోజులకు పాదయాత్ర మొదలు పెడుతామని షర్మిల ప్రకటించారు. అయితే..ఎక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెడుతారనే దానిపై వ్యాఖ్యానించలేదు. కొద్ది రోజుల్లో షర్మిల పాదయాత్ర వివరాలు తెలిసే అవకాశం ఉంది.