Site icon 10TV Telugu

Revanth Reddy Biography : జడ్పీటీసీ మెంబర్ నుంచి చీఫ్ మినిస్టర్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ ప్రస్థానం

Revanth Reddy Political Biography

Revanth Reddy Political Biography

తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు? అంటూ రెండు రోజులుగా నడిచిన హైడ్రామాకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరుని ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. నిన్నటి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారని వేణుగోపాల్ తెలిపారు.

ఈ నెల 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు. తెలంగాణకు మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్ రెడ్డి ప్రొఫైల్ పరిశీలిస్తే.. జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు ఎదిగారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా రాణించారు. అత్యున్నత పదవిని దక్కించుకున్నారు.

* రేవంత్ రెడ్డి పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి.
* 1969 నవంబర్ 8న జన్మించారు.
* నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టారు.
* తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ.
* వనపర్తిలో పాలిటెక్నిక్‌ చేశారు.
* 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు.
* తొలిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
* మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడిగా విజయం.
* కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ మండలంలో అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం.
* 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వాతంత్య్రంగా ఎన్నిక.

CM Revanth Reddy (Photo : Facebook)

* 2008లో రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.
* 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు.
* 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం.
* 2014-17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌.
* 2017 అక్టోబర్ లో టీడీపీకి రాజీనామా.
* 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక.
* 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.
* 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి.

* 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం.
* 2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు.
* కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
* అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారం.
* నెల రోజుల్లో ఏకంగా 83 ప్రచార సభలో పాల్గొన్నారు.
* కొడంగల్‌ స్థానంలో గెలవడమే కాకుండా పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా ప్రచారం.
* కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన రేవంత్ రెడ్డి.

 

Exit mobile version