Telugu Bigg Boss – 4 : ఎలిమినేట్ అయ్యేది ఎవరో

  • Published By: madhu ,Published On : September 12, 2020 / 08:38 AM IST
Telugu Bigg Boss – 4 : ఎలిమినేట్ అయ్యేది ఎవరో

Updated On : September 12, 2020 / 11:07 AM IST

Telugu Bigg Boss – 4 Elimination Round : రియాల్టీ షో సందడి సందడిగా సాగుతోంది. కాంటెస్టులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం చప్ప చప్పగా సాగుతున్నాయని కొందరు పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు వెళుతారనేది ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా సూర్య కిరణ్ ను బయటకు పంపించాలని అనుకుంటున్నారంట. తక్కువ శాతం ఓట్లు పడడమే ఇందుకు కారణం. ఫస్ట్ డే నుంచి హౌస్ లో ఎవరి మీద పడితే వారి మీద కోపం ప్రదర్శించడంతో అభిమానులు అంతగా ఆదరించడం లేదు.

2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ నమోదుకు అవకాశం ఉంది. ఓట్ల స్థానంలో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని టాక్. కానీ..ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది.



ఇక ఎక్కువ ఓట్లు గెలుచుకుని గంగవ్వ ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. పంచ్ డైలాగ్ లతో అదరగొడుతోంది. అభిజిత్, అఖిల్, మెహబూబ్ లు ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. దివి విషయానికి వస్తే..ఒక్క ఎపిసోడ్ రాతను మార్చేసింది. ఆమె సైలెంట్ కిల్లర్ అంటున్నారు. హౌస్ లో ఉండాల్సిందేనంటున్నారు.

మౌనంగా ఉన్న ఈమె..మూడు రోజుల తర్వాత..నోరు విప్పి మాట్లాడింది. అభిజిత్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ గేమ్ గురించి మాట్లాడుతుంటే “నాకు మీరు చాలా ఎక్కువ‌గా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది” అని దివి త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది.



తొలి రెండు స్థానాల్లో గంగవ్వ, అభిజిత్ లున్నారు. తర్వాతి స్థానాల్లో దివి, సూర్యకిరణ్, మొహబూబ, సుజాత, అఖిల్ సార్థక్ లున్నారని తెలుస్తోంది. అయితే..గురువారం నాడు దివి ఫెర్మామెన్స్ తో హైప్ వచ్చింది. సూర్యకిరణ్, అఖిల్ సార్థక్‌, మెహబూబ్, సూజాత మధ్య గట్టిపోటీ నెలకొంది. ఈ నలుగురులో ఒకరు ఎలిమినేట్ కావడం పక్కా అని తెలుస్తోంది.



బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లు.
1. మోనాల్ గుజ్జార్
2. డైరెక్టర్ సూర్యకిరణ్
3. యాంకర్ లాస్య
4. హీరో అభిజిత్
5. జోర్దార్ యాంకర్ సుజాత
6. మెహబూబ్ దిల్‌సే
7. టీవీ 9 యాంకర్ దేవి
8. దేత్తడి హారిక



9. టీవీ యాక్టర్ సయ్యద్ సోహైల్
10. యాంకర్ అరియానా గ్లోరీ
11. అమ్మ రాజశేఖర్
12. కరాటే కళ్యాణి
13. సింగర్ నోయల్
14. హీరోయిన్ దివి
15. అఖిల్ సార్థక్
16. గంగవ్వ