CEC : హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల అధికారుల బృందం పర్యటన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నదతా, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారంపై చర్చించనున్నారు. ఆరుగురు ఐఏఎస్ అధికారులపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశంఠ ఉంది.
- bheemraj
- Published On : October 5, 2023 / 12:47 PM IST
CEC team visit Hyderabad
CEC Officials Team Visit Hyderabad : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడో రోజు పర్యటిస్తోంది. టెక్ మహింద్రాలో దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో సీఈసీ రాజ్ కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం సమావేశమైంది. ఓటు హక్కుపై అవగాహన కల్పించింది.
కాసేపట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశం కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నదతా, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారంపై చర్చించనున్నారు. ఆరుగురు ఐఏఎస్ అధికారులపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశంఠ ఉంది.
Telangana BJP: బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. పలువురి నేతలకు కీలక బాధ్యతలు
మధ్యాహ్నం ఒంగి గంటకు సీఈసీ మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల వివరాలను వెల్లడిస్తారు. మూడు రోజుల పర్యటన మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది.
