మళ్లీ Expectation కి మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు!..

  • Published By: sekhar ,Published On : August 26, 2020 / 12:37 PM IST
మళ్లీ Expectation కి మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు!..

Updated On : August 26, 2020 / 1:48 PM IST

V-Movie Trailer: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన థ్రిల్లర్.. ‘వి’. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్నట్లు Amazon Prime ద్వారా ‘వి’ విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.



నాని సైకోగా అతణ్ణి పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సుధీర్ బాబు కనిపిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్టు నాని, సుధీర్‌ల మధ్య సాగే డేంజరస్ గేమ్ తాలూకు చేజ్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.
https://10tv.in/ram-gopal-varma-biopic-will-be-three-parts/
‘మళ్లీ Expectation కి మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు’ అంటూ ట్రైలర్ చివర్లో నాని చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. పోసాని, జగపతిబాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించిన ‘వి’ చిత్రం నాని 25వ సినిమా కావడం విశేషం.