ODI World Cup 2023 : 20 ఏళ్లుగా ప‌దిలంగా ఉన్న సచిన్ 673 రికార్డు.. కోహ్లి, డికాక్, రచిన్ కళ్లు..

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌చిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశం ముగ్గురు బ్యాట‌ర్లు ఉంది. ఆ ముగ్గురు మ‌రెవ‌రో కాదు..

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ఎన్నో రికార్డులు బ‌ద్దలు అవుతున్నాయి. బ్యాట‌ర్లు ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. శ‌త‌కాల‌తో దుమ్మురేపుతున్నారు. డికాక్‌, కోహ్లీ వంటి ఆట‌గాళ్లు కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉండి త‌మ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా.. ఇప్పుడు అంద‌రి దృష్టి ఓ రికార్డు పై ప‌డింది. గ‌త 20 ఏళ్లుగా ప‌దిలంగా ఉన్న రికార్డును ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎవ‌రైనా బ్రేక్ చేస్తారా..? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ రికార్డు మ‌రేమిటో కాదు.. ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఘ‌న‌త‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌చిన్ 673 ప‌రుగులు చేశాడు.

Sachin Tendulkar

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌చిన్ రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశం ముగ్గురు బ్యాట‌ర్లు ఉంది. ఆ ముగ్గురు మ‌రెవ‌రో కాదు.. ద‌క్షిణాఫ్రికాకు చెందిన క్వింట‌న్ డికాక్‌, న్యూజిలాండ్‌కు చెందిన ర‌చిన్ ర‌వీంద్ర‌, భార‌త్‌కు చెందిన విరాట్ కోహ్లీ..

క్వింట‌న్ డికాక్‌..

Quinton de Kock

క్వింట‌న్ డికాక్ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో శ‌త‌కాల పంట పండిస్తున్నాడు. నాలుగు సెంచ‌రీలు బాదాడు. మొత్తంగా 9 మ్యాచులు ఆడిన డికాక్ 65.66 స‌గ‌టుతో 591 ప‌రుగులు చేశాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఇక స‌చిన్ రికార్డును అందుకునేందుకు డికాక్‌కు మ‌రో 89 ప‌రుగులు అవ‌స‌రం. ఇప్ప‌టికే సౌతాఫ్రికా లీగ్ ద‌శ‌లో అన్ని మ్యాచుల‌ను ఆడేసింది. సెమీస్‌కు అర్హ‌త సాధించింది. సెమీస్‌లో గెలిస్తే ఫైన‌ల్‌కు వెళ్ల‌నుంది. అప్పుడు డికాక్‌కు రెండు మ్యాచులు ఆడే అవ‌కాశం వ‌స్తుంది. కాగా.. ఇదే త‌న చివ‌రి ప్ర‌పంచ‌క‌ప్ అని ఇప్ప‌టికే డికాక్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Sourav Ganguly, : ఇప్పుడున్న‌ది అత్యుత్త‌మ బౌలింగ్ ద‌ళం కాదు.. అప్ప‌ట్లో జ‌హీర్‌, నెహ్రా, శ్రీనాథ్‌..

ర‌చిన్ ర‌వీంద్ర..

Rachin Ravindraభార‌త సంత‌తికి చెందిన ర‌చిన్ ర‌వీంద్ర న్యూజిలాండ్ త‌రుపున అద‌ర‌గొడుతున్నాడు. 9 మ్యాచులు ఆడి 70.62 స‌గ‌టుతో 565 ప‌రుగులు చేశాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేందుకు 109 ప‌రుగులు అవ‌స‌రం. కివీస్ కూడా లీగ్ ద‌శ‌లో అన్ని మ్యాచులు ఆడింది. సెమీస్‌కు అర్హ‌త సాధించింది. సెమీస్‌లో గెలిస్తే ఫైన‌ల్ చేరుకుంటుంది. అప్పుడు ర‌చిన్‌కు రెండు మ్యాచులు ఆడే అవ‌కాశం ఉంటుంది.

విరాట్ కోహ్లీ..

Virat Kohli

భార‌త ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉన్న కోహ్లీ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచులు ఆడి 108.60 స‌గ‌టుతో 543 ప‌రుగులు చేశాడు. స‌చిన్ రికార్డును బ్రేక్ చేసేందుకు 131 ప‌రుగులు అవ‌స‌రం. భార‌త జ‌ట్టు లీగ్ ద‌శ‌లో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది. సెమీస్‌కు అర్హ‌త సాధించిన సంగ‌తి తెలిసిందే. సెమీస్‌లో గెలిస్తే ఫైన‌ల్‌కు వెలుతుంది. ఈ లెక్క‌న విరాట్ ఇంకో మూడు మ్యాచులు ఆడే అవ‌కాశం ఉంది. దీంతో స‌చిన్ రికార్డును విరాట్ బ్రేక్ చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Ganguly : గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ చూసి.. జ‌డేజా ఏడ్చే ఉంటాడు

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితా..

స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 673 ప‌రుగులు 2003 ప్ర‌పంచ‌క‌ప్‌
మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా) – 659 ప‌రుగులు 2007 ప్ర‌పంచ‌క‌ప్‌
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 648 ప‌రుగులు 2019 ప్ర‌పంచ‌క‌ప్‌
డేవిడ్ వార్న‌ర్ (ఆస్ట్రేలియా) – 647 ప‌రుగులు 2019 ప్ర‌పంచ‌క‌ప్‌
ష‌కీబ్ అల్ హ‌స‌న్ (బంగ్లాదేశ్‌) – 606 ప‌రుగులు 2019 ప్ర‌పంచ‌క‌ప్‌
క్వింట‌న్ డికాక్ (ద‌క్షిణాఫ్రికా) – 591 ప‌రుగులు 2023 ప్ర‌పంచ‌క‌ప్‌
కేన్ విలియ‌మ్సన్ (న్యూజిలాండ్‌) – 578 ప‌రుగులు 2019 ప్ర‌పంచ‌క‌ప్‌
ర‌చిన్ రవీంద్ర (న్యూజిలాండ్‌) – 565 ప‌రుగులు 2023 ప్ర‌పంచ‌క‌ప్‌
జో రూట్ (ఇంగ్లాండ్‌)- 556 ప‌రుగులు 2019 ప్ర‌పంచ‌క‌ప్‌
మ‌హేల జ‌య‌వ‌ర్థ‌నే (శ్రీలంక‌) – 548 ప‌రుగులు 2007 ప్ర‌పంచ‌క‌ప్‌
మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్‌) – 547 ప‌రుగులు 2015 ప్ర‌పంచ‌క‌ప్‌
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 543 ప‌రుగులు 2023 ప్ర‌పంచ‌క‌ప్‌

Greatest catch ever : మీ జీవితంలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండ‌రు.. చేతుల‌తో కాదు.. వీపుతో..

 

ట్రెండింగ్ వార్తలు