Greatest catch ever : మీ జీవితంలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండ‌రు.. చేతుల‌తో కాదు.. వీపుతో..

Greatest wicketkeeper catch : ఇప్ప‌టి వ‌ర‌కు మీరు ఎన్ని క్యాచ్‌లు చూసినా కానీ ఇలాంటి క్యాచ్‌ను మీ జీవితంలో ఎన్న‌డూ చూసి ఉండ‌రు.

Greatest catch ever : మీ జీవితంలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండ‌రు.. చేతుల‌తో కాదు.. వీపుతో..

Greatest wicketkeeper catch

క్రికెట్ లో అప్పుడ‌ప్పుడు ఫీల్డ‌ర్లు లేదా వికెట్ కీప‌ర్ అద్భుతమైన క్యాచ్‌ల‌ను ప‌ట్ట‌డాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు మీరు ఎన్ని క్యాచ్‌లు చూసినా కానీ ఇలాంటి క్యాచ్‌ను మీ జీవితంలో ఎన్న‌డూ చూసి ఉండ‌రు. ఇలా కూడా క్యాచ్ ప‌డ‌తారా..? అని మీరు ఆశ్చ‌ర్య‌పోక మాన‌రు. ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో ఆడ‌మ్ గిల్ క్రిస్ట్‌, మ‌హేంద్ర సింగ్ ధోని, కుమార సంగ‌క్క‌ర‌, మార్క్ బౌచ‌ర్ వంటి ఎంతో మంది వికెట్ కీప‌ర్‌లు ఉన్నా.. వారెవ‌రూ కూడా ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ అందుకోలేదు. ఓ వికెట్ కీప‌ర్ ప‌ట్టిన ఓ గొప్ప క్యాచ్ ఇది.

వీపు ద్వారా క్యాచ్ అందుకున్నాడు. కేరళ ప్రీమియర్ లీగ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృత‌మైంది. కేపీఏ 123, కేసీఎస్ఏ జట్ల మ‌ధ్య మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. కేసీఎస్ఏ ఇన్నింగ్స్‌లో రెండు ఓవ‌ర్లు పూర్తి అయ్యే స‌రికి నాలుగు వికెట్లు కోల్పోయి ప‌ది ప‌రుగులు మాత్ర‌మే చేసింది. మూడో ఓవ‌ర్ తొలి బంతికి కేపీఏ 123 ఆనందం రెట్టింపు అయ్యింది. ఫిరాస్ మ‌హ్మ‌ద్ బంతిని వేయ‌గా బ్యాట‌ర్ డ్రైవ్ ఆడాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్ ఏరియా వైపుకు వెళ్లింది.

Babar Azam : బాబ‌ర్ ఆజాంకు కోప‌మొచ్చింది..! టీవీల ముందు మాట్లాడ‌డం ఈజీ..

కీప‌ర్ త‌న కుడి వైపుకు డైవ్ చేస్తూ బంతిని అందుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే.. బాల్ అత‌డి చేతి గ్లోవ్ ను తాకి బౌన్స్ అయ్యింది. గాల్లోకి లేచిన బంతి అత‌డి వీపు పై ప‌డింది. స‌మ‌య‌స్పూర్పిని ప్ర‌ద‌ర్శించిన కీప‌ర్ బంతి కింద‌ప‌డ‌కుండా త‌న రెండు చేతుల‌కు వెన‌క‌వైపు పెట్టాడు. అత‌డి చేతిని తాకి బంతి ఆగిపోయింది. మొత్తంగా బంతి నిశ్చ‌ల‌స్థితికి చేర‌డంతో క్యాచ్ పూర్తి అయ్యింది. స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు వ‌చ్చి కీప‌ర్ ను ఆనందంతో హ‌త్తుకున్నారు.

FACT CHECK : స‌చిన్ టెండూల్క‌ర్ కాళ్లు మొక్కిన మాక్స్‌వెల్‌..? ఆ విధ్వంస‌క‌ర డబుల్ సెంచ‌రీ త‌రువాత‌..

ఎంసీసీ నిబంధ‌నలు ఏం చెబుతున్నాయంటే..? క్యాచ్ ఎప్పుడు పూర్తి అవుతుందంటే.. ఫీల్డ‌ర్ లేదా వికెట్ కీప‌ర్ బంతిని అందుకున్న‌ప్పుడు బాల్ అనేది స‌ద‌రు ఫీల్డ‌ర్ నియంత్ర‌ణలో ఉండాలి. అదే స‌మ‌యంలో స‌ద‌రు ఫీల్డ‌ర్ సైతం త‌న పూర్తి నియంత్ర‌ణ‌లో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే క్యాచ్ పూర్తి అవుతుంది.

ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు వికెట్ కీప‌ర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.