Lava O2 Phone Launch : అద్భుతమైన కెమెరాలతో లావా O2 లేటెస్ట్ బడ్జెట్ ఫోన్.. ధర కేవలం రూ.8,499 మాత్రమే.. సేల్ ఎప్పుడంటే?

Lava O2 Phone Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలతో, 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో లావా O2 బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Lava O2 Phone Launch : అద్భుతమైన కెమెరాలతో లావా O2 లేటెస్ట్ బడ్జెట్ ఫోన్.. ధర కేవలం రూ.8,499 మాత్రమే.. సేల్ ఎప్పుడంటే?

Lava O2 With 50-Megapixel Dual Rear Cameras

Lava O2 Phone Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? లావా ఇంటర్నేషనల్ నుంచి లేటెస్ట్ బడ్జెట్ ఆఫర్‌గా లావా O2 భారత మార్కెట్లో శుక్రవారం (మార్చి 22) లాంచ్ అయింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ 8జీబీ ర్యామ్‌తో యూనిసోక్ టీ616 SoCపై రన్ అవుతుంది. ఈ లావా ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. లావా O2 సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : WhatsApp Link Previews : వాట్సాప్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. చాట్‌లో లింక్ ప్రివ్యూలు కావాలా? వద్దా? యూజర్లదే నిర్ణయం!

భారత్‌లో ఈ నెల 27న సేల్, ధర ఎంతంటే? :
లావా ఓ2 సింగిల్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ 8,499. లాంచ్ ఆఫర్‌గా లావా ఫోన్‌ను రూ. 500 తగ్గింపు పొందవచ్చు. ఇంపీరియల్ గ్రీన్, మెజెస్టిక్ పర్పుల్, రాయల్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అమెజాన్, లావా ఇ-స్టోర్ ద్వారా మార్చి 27 మధ్యాహ్నం 12:00 (IST) నుంచి విక్రయించనుంది.

లావా O2 స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్-సిమ్ (నానో) లావా ఓ2 ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 269పీపీఐ పిక్సెల్ సాంద్రత, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ యూనిసోక్ టీ616 ఎస్ఓసీపై రన్ అవుతుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా అదనంగా ఉపయోగించని స్టోరేజీతో ఆన్‌బోర్డ్ మెమరీని 16జీబీ వరకు విస్తరించవచ్చు. లావా ఓ2 ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఏఐ-సపోర్టుగల 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. స్క్రీన్ ఫ్లాష్‌తో ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

ఫేస్ అన్‌లాక్ ఫీచర్ : 
లావా ఓ2 ఫోన్ 128జీబీ ఇంటర్నల్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని అందిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ (VoLTE), బ్లూటూత్ 5, జీపీఆర్ఎస్, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఏసీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ అందిస్తుంది. లావా 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో కొత్త లావా ఓ2లో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 38 గంటల టాక్ టైమ్, 500 గంటల స్టాండ్‌బై టైమ్‌ని అందిస్తుంది. 165×76.1×8.7ఎమ్ఎమ్ కొలతలు, హ్యాండ్‌సెట్ బరువు 200 గ్రాములు ఉంటుంది.

Read Also : Vodafone Idea eSIM : వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ‘ఇసిమ్’ వచ్చేసింది.. ఇదేలా పొందాలి? ఏయే ఫోన్లలో సపోర్టు చేస్తుందంటే?