WhatsApp Link Previews : వాట్సాప్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. చాట్‌లో లింక్ ప్రివ్యూలు కావాలా? వద్దా? యూజర్లదే నిర్ణయం!

WhatsApp Link Previews : వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. చాట్‌లో షేర్ చేసే లింక్ ప్రివ్యూలను స్టాప్ చేయాలా? లేదా కొనసాగించాలా? అనే నిర్ణయం పూర్తిగా యూజర్ల చేతుల్లోనే ఉండనుంది.

WhatsApp Link Previews : వాట్సాప్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. చాట్‌లో లింక్ ప్రివ్యూలు కావాలా? వద్దా? యూజర్లదే నిర్ణయం!

WhatsApp will soon allow users to choose if they want link previews in chats or not

WhatsApp Link Previews : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌పై పనిచేస్తోంది. వినియోగదారులు తమ చాట్‌లలో లింక్ ప్రివ్యూలను నిలిపివేసే కంట్రోల్ యూజర్లకు అందించనుంది. వినియోగదారుల ప్రైవసీ కోసమే ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటికే ఉన్న ఫీచర్లను సైతం వాట్సాప్ అప్‌డేట్ చేస్తోంది.

ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ (2.24.7.12) :
గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా రూపొందించిన ఇటీవలి అప్‌డేట్‌లో యూజర్లు తమ చాట్‌లలో లింక్ ప్రివ్యూలను నిలిపివేయడానికి కొత్త ఆప్షన్ సూచిస్తోంది. నివేదిక ప్రకారం.. వాట్సాప్ కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. యూజర్లు తమ చాట్‌లలో లింక్ ప్రివ్యూలను నిలిపివేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ (2.24.7.12)లో టెస్టింగ్ దశలో ఉంది. రాబోయే అప్‌డేట్‌లో యూజర్లందరికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఒక నిమిషం వరకు వీడియోలను స్టేటస్ అప్‌డేట్‌గా పెట్టుకోవచ్చు!

ప్రస్తుతం, యూజర్ వాట్సాప్ చాట్‌లో లింక్‌ను షేర్ చేస్తే.. యాప్ ఆటోమాటిక్‌గా వెబ్‌పేజీ ప్రివ్యూని అందిస్తుంది. ఈ ప్రివ్యూ సాధారణంగా క్యాప్షన్, డిస్ర్కప్షన్, కొన్నిసార్లు థంబునైల్ కూడా కనిపిస్తుంటుంది. ఇలాంటి లింక్ ప్రివ్యూలు కొన్నిసార్లు మెసేజ్ పొందిన యూజర్ లింక్‌పై క్లిక్ చేయడానికి ముందే డేటాను బహిర్గతం చేస్తాయి. ఉదాహరణకు.. ఒక క్లిక్‌బైట్ హెడ్‌లైన్ లేదా మిస్ లీడ్ స్నిప్పెట్ కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోకుండా క్లిక్ చేసేలా చేస్తుంది.

టెస్టింగ్ దశలో లింక్ ప్రివ్యూ ఫీచర్ :
ఈ తరహా తప్పుదారి పట్టించే లింక్‌ల నుంచి యూజర్లను ప్రొటెక్ట్ చేసేందుకు వాట్సాప్ లింక్ ప్రివ్యూలను నిలిపివేసే ఆప్షన్ డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ యూజర్‌లు వాట్సాప్ లింక్‌ను షేర్ చేసినప్పుడల్లా ప్రివ్యూని ఉంచాలా? వద్దా అని ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసేలా వాట్సాప్ యూజర్ల చేతుల్లోనే కంట్రోల్ అందించనుంది. ఈ కొత్త ఫీచర్ కంట్రోల్ యూజర్లు లింక్‌లను ఓపెన్ చేయడం లేదా షేర్ చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లింక్ ప్రివ్యూలలోని ఏదైనా సున్నితమైన సమాచారం సురక్షితంగా ఉందని తెలుసుకోవచ్చు.

రియల్ యూఆర్ఎల్ కనిపిస్తుంది :
యూజర్ ప్రైవసీ కోసం వాట్సాప్ ఇటీవలే అదృశ్యమయ్యే మెసేజెస్, కాల్ ఎన్‌క్రిప్షన్ వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. లింక్ ప్రివ్యూలను డిసేబుల్ చేసే ఆప్షన్ అందించడం ద్వారా యూజర్లు తమ ఆన్‌లైన్ కమ్యూనికేషన్స్, షేర్ చేసే డేటాపై కంట్రోలింగ్ అందించేలా వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. అయితే, లింక్ ప్రివ్యూలను నిలిపివేయడం వలన మిస్ లీడింగ్ లింక్‌ల రిస్క్ పూర్తిగా తొలగించలేమని గమనించడం ముఖ్యం. లింక్ షేర్ చేయగానే యూజర్లు ఇప్పటికీ రియల్ యూఆర్ఎల్ చూడగలరు.

కానీ, మోసపూరిత లింక్ షార్ట్‌నర్‌లను ఉపయోగించవచ్చు. అయినప్పటికీ, ఈ అదనపు కంట్రోల్ లేయర్ యూజర్లను మరింత జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. వాట్సాప్ చాట్‌లలో క్లిక్ చేసే లింక్‌లపై సమాచారం తెలుసుకోవడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా, యాప్ కోసం రాబోయే అప్‌డేట్ ఇంకా బీటా టెస్టింగ్‌లో ఉంది. ఫీచర్ విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. రాబోయే యాప్ అప్‌డేట్‌లో వచ్చే అవకాశం ఉంది.

Read Also : WhatsApp Voice to Text Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాయిస్ మెసేజ్ టెక్స్ట్‌లోకి మార్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?