Vodafone Idea eSIM : వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ‘ఇసిమ్’ వచ్చేసింది.. ఇదేలా పొందాలి? ఏయే ఫోన్లలో సపోర్టు చేస్తుందంటే?

Vodafone Idea eSIM : వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఇసిమ్ అనే కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఏయే ఫోన్లలో సపోర్టు చేస్తుందంటే?

Vodafone Idea eSIM : వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ‘ఇసిమ్’ వచ్చేసింది.. ఇదేలా పొందాలి? ఏయే ఫోన్లలో సపోర్టు చేస్తుందంటే?

Vodafone Idea introduces eSIM for prepaid users in New Delhi

Vodafone Idea eSIM : వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేకించి ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఇసిమ్ (eSIM) సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ముందుగా ఈ ఇసిమ్ సర్వీసును న్యూఢిల్లీలోని ప్రీపెయిడ్ యూజర్ల కోసం కంపెనీ విడుదల చేసింది. ముంబై, గోవా వంటి నగరాల్లో ఈ ఆప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇసిమ్ అనేది మీ ఫోన్‌లోని డిజిటల్ సిమ్ కార్డ్ అని చెప్పవచ్చు. మీకు ఫిజికల్ కార్డ్ అవసరం లేదు. మీ ఫోన్ సెట్టింగ్‌ల నుంచి లేదా కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఇసిమ్ సర్వీసు యాక్టివేట్ చేయవచ్చు. దీనికోసం స్టోర్‌కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు.

Read Also : IPL 2024 Live Streaming : జియోసినిమాలో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను మీ మొబైల్, స్మార్ట్ టీవీలో ఇలా ఫ్రీగా చూడొచ్చు..!

వివిధ నెట్‌వర్క్ ప్లాన్‌ల మధ్య ఈజీగా మారేందుకు ఒకేసారి మల్టీ ప్రొఫైల్‌లను స్టోర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఫిజికల్ సిమ్ మాదిరిగా కోల్పోరు. డ్యామేజ్ కాదు. పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించినట్టే. తద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. మొత్తంమీద, సాధారణ సిమ్ కార్డ్‌లతో పోలిస్తే.. ఇసిమ్ ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. ముఖ్యంగా, అన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఇసిమ్‌కు సపోర్టు ఇవ్వవని గమనించాలి. మీకోసం కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను అందిస్తున్నాం. ఇసిమ్ ఫీచర్‌కు వివిధ ఫోన్ మోడల్‌లు సపోర్టు చేస్తాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

ఆపిల్ ఐఫోన్లు : ఐఫోన్ ఎక్స్ఆర్, కొత్త మోడల్‌లు

  • శాంసంగ్ : గెలాక్సీ జెడ్ ఫ్లిప్, గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, గెలాక్సీ ఎస్21
  • ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లు :
  • గూగుల్ : పిక్సెల్ 3, పిక్సెల్ కొత్త మోడల్‌లు
  • వివో : వివో ఎక్స్90 ప్రో
  • మోటోరోలా : మోటోరోలా రెజర్, మోటోరోలా నెక్స్ట్ జనరేషన్ రెజర్, మోటోరోలా ఎడ్జ్ 40
  • నోకియా : నోకియా జీ60, నోకియా ఎక్స్30

ఇప్పటికే ఉన్న కస్టమర్‌ల కోసం వోడాఫోన్ ఐడియా ఇసిమ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ ఇమెయిల్ ఐడీ వోడాఫోన్ ఐడియాతో రిజిస్టర్ అయి ఉండాలి. లేదంటే.. మీ ఇమెయిల్ ఐడీ నుంచి 199కి ఈమెయిల్ పంపండి. 48 గంటల తర్వాత eSIM ప్రాసెస్ కొనసాగించవచ్చు.

మీరు eSIMని ఎలా యాక్టివేట్ చేయవచ్చంటే? :

  •  మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి నుంచి ఇసిమ్‌తో 199కి మెసేజ్ పంపండి.
  • నిర్ధారణ మెసేజ్ తర్వాత 15 నిమిషాలలోపు ‘ESIMY’ అని రిప్లయ్ ఇవ్వండి.
  •  ఆ తర్వాత మీకు ఫోన్ కాల్‌ వస్తే.. మీ సమ్మతి తెలియజేయాల్సి ఉంటుంది.
  • ఆమోదం తర్వాత, మీ రిజిస్టర్ ఇమెయిల్ ఐడీలో క్యూఆర్ కోడ్‌ని అందుకుంటారు.
  • మీ ఫోన్ సెట్టింగ్‌లను ఉపయోగించి స్కాన్ చేయండి (డివైజ్ బట్టి లొకేషన్ మారవచ్చు).
  • మీ డివైజ్ నిర్దిష్ట యాక్టివేషన్ విధానాన్ని ఫాలో అవ్వండి.
  • ఐఫోన్లలో Go to Mobile Data>డేటా ప్లాన్‌ ఎంచుకోండి.
  • క్యూఆర్ కోడ్ ఒక డివైజ్‌కు 7 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.
  • ఆప్షన్‌ల్‌గా సెకండరీ సిమ్ కోసం డేటా ప్లాన్ లేబుల్ పేరు మార్చండి.
  • ఈ నంబర్ కోసం డిఫాల్ట్ లైన్ (ప్రైమరీ/సెకండరీ) ఎంచుకోండి.
  • ఆపై Done ట్యాప్ చేయండి.
  • 30 నిమిషాల్లో ఇసిమ్ యాక్టివేట్ అవుతుంది.
  • డిజిటల్ సిమ్ కార్డ్ సౌలభ్యాన్ని పొందవచ్చు.

Read Also : WhatsApp Link Previews : వాట్సాప్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. చాట్‌లో లింక్ ప్రివ్యూలు కావాలా? వద్దా? యూజర్లదే నిర్ణయం!