నిహారిక, చైతన్యల ఎంగేజ్‌మెంట్ ఎప్పుడంటే..

  • Published By: sekhar ,Published On : July 29, 2020 / 12:42 PM IST
నిహారిక, చైతన్యల ఎంగేజ్‌మెంట్ ఎప్పుడంటే..

Updated On : July 29, 2020 / 1:07 PM IST

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. నితిన్ ఇప్పటికే తన ప్రేయసి షాలినీ కందుకూరికి మూడు మూళ్లు వేయగా, మరో యువ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌‌‌ల మ్యారేజ్ ఆగస్టు 8న జరుగనుంది. వీరి తర్వాత నిహారిక కొణిదెల పెళ్లికి రెడీ అవుతోంది.



Niharika Konidela

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యు నిహారిక కొణిదెల పెళ్లి గుంటూరు ఐజీ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు చైత‌న్య‌తో జ‌రగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొన్ని రోజుల క్రితం నిహారిక త‌నకు కాబోయే భ‌ర్త‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసిన సంగతి తెలిసిందే.



Niharika Konidela

వీరి పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుంద‌ని నాగబాబు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. కాగా.. నిహారిక అన్నయ్య వ‌రుణ్ తేజ్ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో చెల్లెలి ఎంగేజ్‌మెంట్ డేట్‌ను తెలియ‌జేశారు. ఆగ‌స్ట్ 13న ఇరు కుటుంబాల పెద్ద‌ల స‌మ‌క్షంలో చైత‌న్య‌, నిహారిక ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందని చెప్పారు.