MAA Elections: ‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటమిపై.. ప్రకాష్ రాజ్ స్పందించారు. తనను అతిథిగా మాత్రమే చూశారు కాబట్టి.. ఇకపై అతిథిగానే కొనసాగుతానని చెప్పారు.

MAA Elections: ‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

Prakash raj resigns to MAA membership

Updated On : October 11, 2021 / 12:00 PM IST

Prakash raj resigns to MAA membership:టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటమిపై.. ప్రకాష్ రాజ్ స్పందించారు. తనను అతిథిగా మాత్రమే చూశారు కాబట్టి.. ఇకపై అతిథిగానే కొనసాగుతానని చెప్పారు. తనను తెలుగువాడు కాదంటూ టాలీవుడ్ సీనియర్ నటులు చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలను గౌరవిస్తానని అన్నారు. కానీ.. ఓ కళాకారుడిగా తనకు ఇలాంటి పరిస్థితి బాధ కలిగిస్తోందని.. అందుకే తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2 దశాబ్దాలకు పైగా ఉన్న బంధానికి ఇవాల్టితో ముగింపు పలుకుతున్నట్టు చెప్పారు.

”మా ఎన్నికల్లో ప్రాంతీయ వాదం తీసుకొచ్చారు. నేను తెలుగు వాడిని కాదు అని నన్ను ఓడించారు. అలాంటప్పుడు నేను మా సభ్యుడుగా ఉండటం లో అర్థం లేదు. “మా” సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. అయినా.. తెలుగులో నటించడం కొనసాగిస్తాను. నటీనటులు, దర్శకులు, రచయితలతో నా అనుబంధం కొనసాగుతుంది. నాపై వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు, రవిబాబు వంటి వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నా” అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.