Seema Haider : సినిమాలో నటించనున్న సీమా హైదర్…రా ఏజెంటుగా పాత్ర

ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమాహైదర్ సినిమాలో నటించనుందా? అంటే అవునంటున్నారు చిత్ర దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్‌లు....

Seema Haider : సినిమాలో నటించనున్న సీమా హైదర్…రా ఏజెంటుగా పాత్ర

Seema Haider

Seema Haider : ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమాహైదర్ సినిమాలో నటించనుందా? అంటే అవునంటున్నారు చిత్ర దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్‌లు. పాకిస్థాన్ దేశం నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న సీమా హైదర్ ఈ సినిమాలో రా ఆఫీసర్‌గా నటించనుంది. (Seema Haider to play RAW agent in movie)

Indian birds : భారతీయ పక్షులు పెంచుకోవడంపై నిషేధం : బెంగాల్ అటవీశాఖ మంత్రి వెల్లడి

జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం గ్రేటర్ నోయిడాలో పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌ను కలిసి ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్‌ను ఇస్లామిక్ రాడికల్స్ హత్య చేసిన ఘటనపై వారి రాబోయే చిత్రం ‘‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’’ కోసం సీమా హైదర్ ను దర్శకులు ఆడిషన్ చేశారు. (Film director takes audition) ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో సీమా హైదర్, సచిన్ మీనా కొత్త ఇంటికి మారిన తర్వాత వారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Mumbai college : ముంబయి కళాశాలలో బురఖా, హిజాబ్‌పై ఆంక్షలు

తాము ఆహారం కోసం సరుకులు లేక పలు అవస్థలు పడుతున్నామని దంపతులు సీమా, సచిన్ చెప్పారు. దీంతో సినిమా దర్శకులు సీమా హైదర్ కు సినిమాల్లో నటించేందుకు అవకాశం కల్పించారని సమాచారం. ఇప్పటికే గులాం హైదర్‌తో వివాహమై నలుగురు పిల్లలతో ఉన్న సీమా.. సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్‌ను వదిలి అక్రమంగా సరిహద్దులు దాటి పిల్లలతో భారత్‌లోకి ప్రవేశించింది.

Crop Loan Waiver : రైతులకు శుభవార్త.. నేటి నుంచి రుణమాఫీ, తొలి విడతలో రూ.19వేల కోట్లు

సీమా హిందూ మతంలోకి మారిన తర్వాత ఇద్దరూ హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న సీమా భర్త గులామ్ తన భార్య, పిల్లలను తిరిగి కలవాలని కోరుకున్నాడు. అయితే తాను పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని, సచిన్‌తో కలిసి జీవించాలనుకుంటున్నట్లు సీమా చెప్పింది. బెయిల్‌పై విడుదలైనప్పటికీ సీమా, సచిన్ జంటను దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.