SSC JE 2025 Notification: నిరుద్యోగులకు అలర్ట్.. ఎస్ఎస్సీ జేఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నారా? త్వరలో గడువు ముగుస్తోంది.. పూర్తి వివరాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) JE 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1340 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

SSC JE 2025 Notification: నిరుద్యోగులకు అలర్ట్.. ఎస్ఎస్సీ జేఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నారా? త్వరలో గడువు ముగుస్తోంది.. పూర్తి వివరాలు

SSC JE 2025 Jobs Notification

Updated On : July 8, 2025 / 12:37 PM IST

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) JE 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1340 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. దీనికి సంబదించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలుకాగా ఇది జూలై 21 వరకు కొనసాగనుంది. ఈ పోస్టుల దరఖాస్తుకు సంబందించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యార్హతలు:

  • సివిల్ ఇంజనీరింగ్ పోస్ట్ కోసం సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా పూర్తి చేయాలి. రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
  • ఎలక్ట్రికల్ & మెకానికల్ పోస్ట్ కోసం ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా పూర్తి చేయాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
  • సివిల్/ఎలక్ట్రికల్ కోసం సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.
  • సివిల్/మెకానికల్ కోసం సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి.
  • ఇతర డిపార్ట్‌మెంట్లలో ఉండే పోస్టుల కోసం సంబంధిత డిసిప్లిన్‌లో డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమిసతి:

  • ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు జనవరి 2, 1996 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. 30 ఏళ్ళు మించకూడదు.
  • CPWD పోస్టులకు అప్లై చేసుకునే వారి వయసు 32 ఏళ్ల వరకు ఉండాలి. జనవరి 2, 1994 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి.
  • అలాగే SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, PwD వారికి 10 సంవత్సరాలు, PwD+OBC వారికి 13 సంవత్సరాలు, PwD + SC/ST వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్‌మెన్ కి 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

SSC JE 2025 ముఖ్యమైన తేదీలు:

  • జూలై 21, 2025: దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ
  • జూలై 22, 2025: దరఖాస్తుల సవరణ
  • అక్టోబర్ 27 నుంచి 31: SSC JE టైర్ 1 పరీక్ష

ఎంపిక విధానం: SSC JE ఎంపిక ప్రక్రియలో మూడు దశల్లో జరుగుతుంది. మొదట పేపర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. తరువాత పేపర్ జనరల్ ఇంజనీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్), ఈ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

వేతన వివరాలు: కేంద్ర 7వ వేతన స్కేల్ ప్రకారం రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు జీతం లభిస్తుంది.