Dreams : కలలు ఎందుకు గుర్తుండవు ?
రాత్రి నిద్రపోయాక అందరికీ కలలు వస్తుంటాయి. విచిత్రమైన కలలు వస్తుంటాయి. ఆ కలలు కనే సమయంలో భయాన్ని, బాధని, సంతోషాన్ని పంచుతాయి. మేల్కొన్న తరువాత వాటిలో కొన్ని గుర్తుంటాయి. చాలామటుకు మర్చిపోతాం. అసలు కలలు ఎందుకు గుర్తుండవు?

Dreams
Dreams : రాత్రి పూట నిద్రలో చాలామందికి కలలు వస్తాయి. కొన్ని కలలు సంతోషాన్ని ఇస్తాయి. కొన్ని కలలు కనిపించేవాటిని నిజమనే భ్రమలో ముంచేస్తాయి. కొన్ని కలలు భయపెడతాయి. కొన్ని కలలు గుర్తుంటాయి. కొన్నింటిని మర్చిపోతాం. అందుకు కారణం ఏంటి?
Uttar Pradesh : పీడకలలు వస్తున్నాయని చోరీ చేసిన విగ్రహాలు తిరిగి ఇచ్చేసిన దొంగలు
బాగా కలలు కనే నిద్ర దశను రాపిడ్ ఐ మూమెంట్ (REM) అంటారు. ఈ నిద్ర దశలో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందట. నిద్రపోయిన 90 నిముషాల తరువాత మేల్కొనే ఒక గంట ముందు కలలు వస్తాయట. మరో దశ NREM .. డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు కలలు వస్తాయట. ఇది కూడా 90 నిముషాల వరకూ ఉంటుందట. కొంతమందికి కలలు వారు ఎంతసేపు నిద్రపోతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటాయట.
‘బిహేవియరల్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ జర్నల్’లోని 2016 కథనంలో నిద్రలో ఎసిటైల్‌కోలిన్, నోర్‌పైన్‌ఫ్రైన్ అనే స్థాయిలు మారడం వల్ల తమ కలలను మరచిపోతారని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కలలను మర్చిపోవడానికి మరో కారణం సరైన నిద్ర లేకపోవడం. మానసిక ఆరోగ్యం కూడా కలలు మర్చిపోవడానికి కారణం అట. ఆందోళన, డిప్రెషన్ నిద్రను కోల్పోయేలా చేస్తాయి. ఇవన్నీ.. విషయాలను తీసుకునే మెదడు సామర్థ్యంపై పనిచేస్తాయి. మనం మేల్కొన్న మొదటి 90 సెకండ్లు మాత్రమే కలలు గుర్తుంటాయట. ఆ తరువాత మర్చిపోతామట. ఇక పీడ కలలు గుర్తుంటాయట. ఎందుకంటే అవి విపరీతమైన భయాన్ని కలిగించడం వల్ల మెదడు వాటిని గుర్తుంచుకుంటుందట.
Dreams In Sleep : నిద్రలో కలలు వస్తున్నాయా! అసలు కారణం ఏంటంటే?
స్లీప్ అప్నియా, నిద్రలేమి, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి స్లీస్ డిజార్డర్లు కూడా మీ డ్రీమ్ రీకాల్‌ను ప్రభావితం చేస్తాయి.. నిద్ర పోతున్న సమయంలో ఎక్కువ ఆందోళన, నెగెటివ్ ఆలోచనలు చేసే వ్యక్తులు తమ కలలను గుర్తుంచుకోవడం కష్టం. స్లీప్ మెడిసిన్స్.. యాంటిడిప్రెసెంట్స్ డ్రీమ్ రీకాల్‌ను కూడా ప్రభావితం చేస్తాయట. ఇక పురుషుల కంటే స్త్రీలు కలలను ఎక్కువగా గుర్తుంచుకుంటారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీలకు జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటం కారణమట.. మహిళలు కనే కలలు భావోద్వేగాలతో ఉంటాయట. కలలను గుర్తుంచుకోవాలంటే గుర్తున్న వాటిని రాసుకోవాలి. రాత్రివేళ మద్యం సేవించడం వల్ల సరైన నిద్రను పొందలేరు. పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, వెచ్చని నీటితో స్నానం చేయడం, ధ్యానం చేయడం, హాయిని గొలిపే సంగీతం వినడం ఇవి మంచి నిద్రకు సాయపడతాయి.