Viral Video
Viral Video: ఓ మహిళ చీరకట్టులో జిమ్ లో బరువులు మోస్తూ వ్యాయామం చేసింది. లారీ టైరును ఎత్తి మరీ ఆమె వ్యాయామం చేసిన తీరు అలరిస్తోంది. ఇది ప్రారంభం మాత్రమేనంటూ ఈ వీడియోను రీనా సింగ్ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంట్లోనే అది విపరీతంగా వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియో 3.5 కోట్ల మంది చూశారు.
రీనా సింగ్ జిమ్ లో చీరకట్టులోనే పలు రకాల వ్యాయామలు చేసింది. జంపింగ్, లిఫ్టింగ్, లాట్ పుల్ డౌన్స్ వంటి అన్ని రకాలు వ్యాయామాలను ఆమె సునాయాసంగా చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. రీనా సింగ్ సాధించిన ఫిట్ నెస్ ను ప్రశంసిస్తూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మహిళలు జిమ్ లో ఇంతగా వ్యాయామం చేయడమే కష్టమనుకుంటే, ఈమె మాత్రం ఇన్ని రకాల వ్యాయామాలను చీరకట్టులో చేస్తూ అబ్బురపరుస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఆమెను చూశాక తనకూ వ్యాయామం చేయాలనిపిస్తోందని ఓ మహిళ పేర్కొంది. రీనా సింగ్ ఫిట్ నెట్ ట్రైనర్. తన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటుంది. ఆమె తన జిమ్ లో శిక్షణను ఇస్తుంటుంది.
China Ends Quarantine: చైనాలో విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఎత్తివేత.. మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి