China Ends Quarantine: చైనాలో విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఎత్తివేత.. మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి

టొరంటో, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులు ఆదివారం క్వారంటైన్ లేకుండానే గమ్య స్థానాలకు చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఉన్న హాంకాంగ్, ఇతర దేశాల నుంచి కూడా సందర్శకుల్ని చైనా ఆహ్వానిస్తోంది. గతంలో విదేశీ ప్రయాణికుల విషయంలో చైనా తీవ్ర ఆంక్షలు విధించింది.

China Ends Quarantine: చైనాలో విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఎత్తివేత.. మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి

China Ends Quarantine: విదేశాల నుంచి వచ్చే వాళ్లకు చైనా క్వారంటైన్ నిబంధన ఎత్తివేసింది. ఆదివారం నుంచి ఈ కొత్త నిబంధన అమలవుతోంది. మూడేళ్ల తర్వాత చైనా క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడం విశేషం. విదేశీ ప్రయాణికులు, చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వాళ్లు ఇకపై ఎవరూ క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదు.

Pawan Kalyan: ఆ విషయంపైనే చంద్రబాబు, నేను చర్చించాం: పవన్ కల్యాణ్

టొరంటో, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులు ఆదివారం క్వారంటైన్ లేకుండానే గమ్య స్థానాలకు చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఉన్న హాంకాంగ్, ఇతర దేశాల నుంచి కూడా సందర్శకుల్ని చైనా ఆహ్వానిస్తోంది. గతంలో విదేశీ ప్రయాణికుల విషయంలో చైనా తీవ్ర ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా క్వారంటైన్ నిబంధన పాటించాల్సి ఉండేది. వ్యాక్సిన్లు తీసుకుని ఉండాలి. ఇప్పుడు మాత్ర ఇలాంటివేవీ చైనా పాటించడం లేదు. ప్రస్తుతం చైనా వచ్చే ప్రయాణికులు 48 గంటల ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకుని ఉంటే సరిపోతుంది. అయితే, ఒకపక్క దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న టైంలో చైనా క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడం మరో విశేషం.

Chandrababu Naidu: రాజకీయాల్లో పొత్తులు సహజం.. గతంలోనూ పొత్తులు పెట్టుకున్నాం: చంద్రబాబు

చైనాలో పూర్తి స్థాయి కోవిడ్ రూల్స్‌ను ఆ దేశం ఎత్తివేసింది. దీంతో ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించడం మానేశారు. ఫలితంగా దేశంలో కోవిడ్ కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టమవుతోంది. కోవిడ్ పేరుతో గతంలో చాలా మందిని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచేది. ఇప్పుడు అలాంటి వాళ్లందరినీ స్వేచ్ఛగా వదిలేసింది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వం వెల్లడించడం లేదు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.