కీర్తి పతాకం : కరీంనగర్‌లో అతిపెద్ద జెండా

కరీంనగర్…ప్రధాన పట్టణ కేంద్రం. జిల్లాకు ప్రధాన పరిపాలన కేంద్రంగా పిలువబడుతుంది. రాష్ట్రంలో ఐదో అతిపెద్ద సిటీగా ఉన్న దీనిని మున్సిపల్ కార్పొరేషన్ పాలిస్తుంది. స్మార్ట్ సిటీ జాబితాలో చోటు సంపాదించుకున్న జిల్లాను సుందరంగా తీర్చిద్దాలని మేయర్, అధికారులు కృషి చేస్తున్నారు. మున్సిపల్, పోలీసు, విద్యుత్, విద్య, వైద్య, ఇతర రంగాల్లో పలు సంస్కరణలను చేపడుతున్న అధికారులు ఇతర జిల్లాలకు ధీటుగా కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఎన్నో విశేషాలున్న ఈ జిల్లాలో మరో స్పెషల్ చేరింది.
అతిపెద్ద జాతీయ జెండా ఏర్పాటైంది. 152 అడుగుల స్తంభంపై ఏర్పాటు చేసిన ఈ జెండా 32 అడుగుల పొడవు..42 అడుగుల వెడల్పుగా ఉంది. ఈ జెండాను ఎంపీ వినోద్ కుమార్ ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో రెండవ..దేశంలో మూడో అతిపెద్ద జాతీయ జెండా ఇది. కరీంనగర్ నడిబొడ్డున అంటే…మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేశారు. కర్నాటక, హైదరాబాద్ తరువాత అత్యంత ఎత్తైన జాతీయ జెండాను కరీంనగర్ నగర పాలక సంస్థ ఏర్పాటు చేసింది. ఒక ఐకాన్‌గా మార్చేందుకు…మేయర్ రవీందర్‌సింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ భారీ జెండా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కులో 303 అడుగుల ఎత్తులో జెండా ఉన్న సంగతి తెలిసిందే.