లోక్ సభకి 548, అసెంబ్లీకి 3 వేల 925 నామినేషన్లు : ద్వివేది
ఏపీలో లోక్ సభకు 548, అసెంబ్లీకి 3 వేల 925 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

ఏపీలో లోక్ సభకు 548, అసెంబ్లీకి 3 వేల 925 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
అమరాతి : ఏపీలో నామినేషన్ల పరిశీలన పూర్తైందని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. 25 లోక్ సభ స్థానాల్లో మొత్తం 548 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాల్లో 3 వేల 925 నామినేషన్లు దాఖలు అయ్యాయని తెలిపారు. నంద్యాల నియోజవర్గంలో అత్యధికంగా 38 నామినేషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. 17 నియోజక వర్గాల్లో 15 కన్నా ఎక్కువగా నామినేషన్లు వచ్చాయన్నారు. ఒక అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 61 నామినేషన్లు వచ్చాయని వెల్లడించారు. ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారన్నది ప్రకటిస్తామన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా కూడా సిద్ధమైందని తెలిపారు. 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. జనవరి 11 తర్వాత 25 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. సీ విజన్ యూప్ ద్వారా 20 వేల 614 ఫిర్యాదులు అందాయన్నారు.
రూ.12.13 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మొత్తం 734 కేసులు నమోదయ్యాయిని వెల్లడించారు. ఐటీగ్రిడ్ విషయంలో ఏపీ, తెలంగాణ సిట్ కు సహకరిస్తామని తెలిపారు.