లక్షా 42 వేల 408 నకిలీ ఓట్లు తొలగించాం : సీఈవో ద్వివేది 

ఈసీకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని సీఈవో ద్వివేది అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 04:45 PM IST
లక్షా 42 వేల 408 నకిలీ ఓట్లు తొలగించాం : సీఈవో ద్వివేది 

ఈసీకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని సీఈవో ద్వివేది అన్నారు.

అమరావతి : ఈసీకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని సీఈవో ద్వివేది అన్నారు. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి 20 వ తేదీ లోపు ఫామ్ -7 దరఖాస్తులను క్లియర్ చేస్తామన్నారు. 165 నియోజకవర్గాల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తైందని తెలిపారు. 

ఫామ్ -7 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్ష 44 వేల 825 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. వీటిలో 6 లక్షల 10 వేల 143 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని..2 లక్షల 58 వేల 852 దరఖాస్తులు ఆమోదించబడ్డాయని తెలిపారు. ఇప్పటి వరకు లక్షా 42 వేల 408 నకిలీ ఓట్లను తొలగించామని చెప్పారు. ఫామ్ -7 దరఖాస్తులపై రాష్ట్ర వ్యాప్తంగా 440 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. షెడ్యూల్ తర్వాత కొత్త ఓట్ల కోసం 3 లక్షల 57 వేల 539 ఫామ్ -6 దరఖాస్తులు వచ్చాయన్నారు. మార్చి 15 నాటికి 10 లక్షల దరఖాస్తులు రావొచ్చని అంచనాగా ఉందన్నారు.