కొడుకుని తలకిందులుగా వేలాడదీసి శిక్షించిన తండ్రి అరెస్టు

ఉత్తరప్రదేశ్ లోని వ్యక్తి కన్న కొడుకుని తలకిందులుగా గ్రామస్థుల ముందే వేలాడదీసి శిక్షించాడు. గ్రామస్థుల్లో ఒకరు 52 సెకన్ల వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఇంటి కిటికీకి తలకిందులుగా తాడుతో కట్టేసి అటూ ఇటు లాగుతూ శిక్షిస్తున్నాడు. ఆ సమయంలో వ్యక్తి చుట్టూ నిల్చొని అతను చిన్నపిల్లోడు.. వదిలేయమని చెప్తున్నారు.
‘మేం ఆ వీడియోను గమనించాం. ఇది శనివారం సాయంత్రం 6-7గంటల మధ్యలో జరిగింది. ఆ చిన్నారి చేసిన పనికి అసంతృప్తితో ఆ వ్యక్తి అలా చేశాడు’ అని వెస్ట్ ఆగ్రా పోలీస్ ఆఫీసర్ రవి కుమార్ వెల్లడించారు.
మూణ్నాలుగు రోజుల ముందు అతను తన భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత చెల్లి ఇంటికి వెళ్లాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీడియోలో ఉన్న వ్యక్తి అతని పెద్ద కొడుకు. అతనిని ప్రశ్నిస్తున్నాం. పైగా ఈ ఘటన జరిగినప్పుడు అతను మద్యం మత్తులో ఉన్నాడు’ అని చెప్పారు పోలీస్ అధికారి.