చంద్రబాబుకి అమరావతే ఓ బ్యాంక్ అకౌంట్, పోలవరం ATM : కొడాలి నాని

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 04:54 AM IST
చంద్రబాబుకి అమరావతే ఓ బ్యాంక్ అకౌంట్, పోలవరం ATM : కొడాలి నాని

Updated On : November 28, 2019 / 4:54 AM IST

రాజధాని అమరావతిని చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు అమరావతిని  బ్యాంక్ ఎకౌంట్ లాగా..పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. 
అమరావతిని గాలికి వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని పరిశీలించేందుకు పర్యటన చేపట్టటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల వద్ద భూములు లాక్కొని ఇన్ సైడ్ ట్రేడింగ్ లకు పాల్పడ్డారని మండిపడ్డారు. 

ఈ విషయం అర్థం చేసుకున్న ప్రజలు విచక్షణతో ఓట్లు వేసి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారనీ..ఇప్పుడు తమ ప్రభుత్వానికి రాజధానితో పాటు ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమేనని 10టీవీతో మంత్రి కొడాలని నాని తెలిపారు. 

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలకు పరిశీలించేందుకు మాజీ సీఎం చంద్రబాబు చేపట్టిన పర్యటన రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో బాబు టూర్ ను  వైసీపీ నేతలతో పాటు పలువురు అడ్డుకుంటున్నారు. బాబూ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాకే చంద్రబాబు అమరావతిలో పర్యటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క వైసీపీ వైఖరిపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. వైసీపీ పథకం ప్రకారంగా కొంతమందిని రెచ్చగొచ్చి ఆందోళన చేపట్టిందని విమర్శిస్తున్నారు.