మా ఎంపీలు,ఎమ్మెల్యేలకు డెంగ్యూలు,స్వైన్ ఫ్లూ వచ్చాయేమో…హాస్పిటల్స్‌లో వెతుకుతున్నాం : రైతులు

అమరాతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు మాకు కొన్ని రోజులుగా కనిపించటంలేదు. వారికి డెంగ్యూలు,స్వైన్స ఫ్లూ, మలేరియా వంటి రోగాలొచ్చాయేమో..వాళ్లు ఏ హాస్పిటల్ లో ఉన్నారో మాకు తెలియటంలేదు.వారంతా ఏ హాస్పిటల్ లోఉన్నారోనని మేమంతా ఆందోళన చెందుతున్నాం..వారి కోసం హాస్పిటల్స్ లో వెదుకుదామని అనుకుంటున్నాం అని అమరావతి ప్రాంతంలోని రైతులు అంటున్నారు.
మూడు రాజధానులకు అంటూ సీఎం జగన్ ప్రతిపాదించిన నాటి నుంచి మా ఎంపీలు, ఎమ్మెల్యేలు కనిపించట్లేదు వారికి ఏమైనా అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్ లో ఉన్నందువల్ల తమకు వారు కనిపించట్లేదని వారి ఆరోగ్యం కోసం తాము ఆందోలన చెందుతున్నామంటూ రైతులు నేతలపై సెటైర్లు వేశారు.
అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని తాము చేసిన నిరసనలపై మంత్రులు, ఎమ్మెల్యేలు..స్పీకర్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారనీ..మా ఉద్యమంపై పాలకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అని రైతులు హెచ్చరించారు. ఇక నుంచైనా పాలకులు నోరు అదుపులో పెట్టుకోవాలనీ..లేకుండా మీ పద్ధతిలో మీరు మాట్లాడితే..మా పద్దతిలో మేం సమాధానం చెబుతామని హెచ్చరించారు. రైతులంటే పంటలు పండిచేవారే కాదు..అవసరమైతే నేతల తలరాతలు మార్చేవారని గుర్తుంచుకోవాలనీ..అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని వైసీపీ నేతలపై అమరావతి ప్రాంత రైతులు మండి పడ్డారు.
సీఎం జగన్ రాజధాని అమరావతి అనే ప్రకటించాలనీ లేని పక్షంలో వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే మీ రాజకీయ జీవితాలకు శరమాకం పలికినట్లేననీ హెచ్చరించారు.
అమరావతిని మహానగరం చేస్తామంటే రైతులంతా కలిసి ప్రాణంగా చూసుకునే పంట భూముల్ని 33 వేల ఎకరాలు ఇచ్చామని కానీ మసి పూసి మారేడు కాయ చేసి తిరిగి ఇచ్చేస్తారని కాదని అన్నారు.
పదవులు లేకపోతే బతకలేని రాజకీయ నేతల్లారా..జాగ్రత్త రైతుల జీవితాను నాశనం చేద్దామని మీరు అనుకుంటే మీ బతకులు హీనంగా మారిపోతాయని గుర్తు పెట్టుకోండి అంటూ రైతులు ఆగ్రహంతో హెచ్చరించారు. ఇంతకాలం లేని ఉత్తరాంధ్రా అభివృద్ది ఇప్పుడే గుర్తుకొచ్చిందా అంటూ రైతులు ప్రశ్నించారు.