బెజవాడలో దారుణం: మహిళ గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు

  • Published By: vamsi ,Published On : January 31, 2020 / 06:00 AM IST
బెజవాడలో దారుణం: మహిళ గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు

Updated On : January 31, 2020 / 6:00 AM IST

ప్రశాంతంగా ఉండే బెజవాడలో మర్డర్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. నగరంలోని భ‌వానీపురంలో మహిళ హత్య కలకలం రేపింది. ఓ ఒంటరి మ‌హిళను ఇంట్లోనే అత్యంత దారుణ‌ంగా హ‌తమార్చారు దుండగులు. అచంతేకాదు గుర్తుతెలియని దుండగులు ఆమె ఒంటిపై బంగారు ఆభ‌ర‌ణాలు ఎత్తుకెళ్ళారు. కుటుంబసభ్యులు ఇంటికి చేరుకున్న తర్వాత మృతదేహాన్నిచూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలో భవానీపురంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యేదుపాటి పద్మావతి(52)ని గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచేశారు నగలు ఎత్తుకెళ్లడంతో దోపిడీ దొంగల పనిగా అనుమానిస్తున్నారు. ఆధారాలు లభించకుండా దుండగులు ఇంట్లో కారంపొడి చల్లినట్లు పోలీసులు చెబుతున్నారు. క్లూస్ దొరక్కుండా కుక్కలను దారి మళ్లించేందుకే కారం చల్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు అంటున్నారు.

సాయంత్రం ఆరు గంటల సమయంలో భవానీపురం ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని.. అలాంటి వేళలో హత్య జరగడం.. పక్కా ప్లాన్ ప్రకారమే అని అంటున్నారు పోలీసులు. పద్మావతి భర్త ఇంటికి సమీపంలోనే షాప్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య చేశారు. ప్రాధమికంగా దోపిడీ దొంగల పనిగా అనుమానిస్తున్న పోలీసులు.. ఆస్తి వివాదాలు.. కుటుంబ తగాదాల గురించి కూడా ఆరా తీశారు. హత్య జరిగిన ఇంటికి సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.