చంద్రబాబు ఆగ్రహం : అందరూ కలిసి టీడీపీపై కుట్రలు, ఏపీని బీహార్ చేస్తారా!

అమరావతి : ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్, ఈసీలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దుష్టశక్తులన్నీ కలిసి టీడీపీ దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 07:59 AM IST
చంద్రబాబు ఆగ్రహం : అందరూ కలిసి టీడీపీపై కుట్రలు, ఏపీని బీహార్ చేస్తారా!

Updated On : April 12, 2019 / 7:59 AM IST

అమరావతి : ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్, ఈసీలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దుష్టశక్తులన్నీ కలిసి టీడీపీ దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని

అమరావతి : ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్, ఈసీలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దుష్టశక్తులన్నీ కలిసి టీడీపీ దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ రోజున రాష్ట్రంలో అరాచకం సృష్టించారని చంద్రబాబు అన్నారు. ఏపీ నానశం చేసేందుకు నేరస్తులంతా సర్వశక్తులు ఒడ్డారని చెప్పారు. మోడీ, జగన్, కేసీఆర్ లతో పోరాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఈవీఎంలు  మొరాయించడంపైనా చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. రిపేర్ పేరుతో ఈవీఎంలను మేనిపులేషన్ జరిగిందన్నారు. మేనిపులేషన్ జరగలేదు అని చెప్పడానికి గ్యారంటీ లేదన్నారు. టీడీపీని దెబ్బతీసేందుకు ఇన్  కమ్ ట్యాక్స్, ఈడీ, సీబీఐ, తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం.. ఇలా అందరిని ప్రయోగించారని చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ రోజున ఏపీలో హింసాత్మక ఘటనలతో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారని  చంద్రబాబు మండిపడ్డారు. 35శాతం ఈవీఎంలు పని చెయ్యకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పక్కా ప్లాన్ తోనే రౌడీలను దించి భయాందోళనలు సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు.

కేంద్ర ఎన్నికల సంఘంపైనా చంద్రబాబు మండిపడ్డారు. సాంకేతిక లోపాల పేరుతో ఓటర్లను ఆడుకున్నారని ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఎన్నికల ప్రధాన అధికారికే ఇబ్బంది ఎదురైతే ఇక  సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఓ సాఫ్ట్ వేర్ పై ఆధారపడే పరిస్థితి తీసుకురావడం దారుణం అన్నారు. తెల్లవారుజామున వరకు పోలింగ్ జరిగిందంటే..  ఎన్నికల కమిషన్ దీనికి ఏం సమాధానం చెబుతుంది అని చంద్రబాబు ప్రశ్నించారు. అసలు విధుల పట్ల ఈసీకి నిబద్దత ఉందా? అని అడిగారు.

ప్రశాంత ఏపీలో విధ్వంసాలు సృష్టించారని చంద్రబాబు అన్నారు. అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయన్నారు. నేరస్తులు చెప్పినట్టు ఈసీ పని చేసిందన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. ఏపీని  మరో బీహార్ లా మార్చే కుట్ర జరిగిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారా అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం నిజంగా గ్రేట్  అన్నారు. వారందరికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ధృడ సంకల్పంతో వచ్చిన ఓటర్లను చంద్రబాబు అభినందించారు.