జగన్ సీఎం అయ్యాక ఫస్ట్ టైమ్ : ఏపీ అవతరణ దినోత్సవం

ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 02:05 AM IST
జగన్ సీఎం అయ్యాక ఫస్ట్ టైమ్ : ఏపీ అవతరణ దినోత్సవం

Updated On : November 1, 2019 / 2:05 AM IST

ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో

ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే అవతరణ వేడుకలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించున్నారు. దీంతోపాటు స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల కుటుంబ సభ్యులు, బంధువులను ఘనంగా సన్మానించనున్నారు. 

ఐదేళ్ల తర్వాత… ఏపీలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రం విడిపోయాక మొదటిసారి జరుగుతున్న వేడుకలు కావడంతో… జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగేవి. తెలంగాణ, ఏపీగా విడిపోయాక… టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి జూన్ రెండు నుంచి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష పేరుతో కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే… జగన్ సీఎం అయ్యాక.. నవంబర్ 1నే అవతరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. 

ఇక మూడు రోజుల పాటు జరిగే అవతరణోత్సవాల్లో… స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సన్మానించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. దీంతో దానికి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ… చేనేత, హస్తకళల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. చేనేత కళాకారులకు జగన్ రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు, ప్రసిద్ది చెందిన వంటకాలను ప్రజలకు అందించేందుకు 25 ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

అయితే… వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. నవ్యాంధ్ర అవతరణపైనా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం విడిపోయిన రోజుకు.. అవతరణకు తేడా కూడా తెలియదని విమర్శించారు. మొత్తంగా మూడు రోజుల పాటు రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.