డ్వాక్రా మహిళలకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. బ్యాంకు లింకేజీ ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. బ్యాంకు లింకేజీ ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. బ్యాంకు లింకేజీ ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. మహిళల బ్యాంకు అకౌంట్ లో రూపాయి జమ చేసి తర్వాత పూర్తి వడ్డీ చెల్లించనుంది. లక్ష రూపాయల లోపు తీసుకున్న డ్వాక్రా మహిళలకు 4 విడతల్లో రుణమాఫీ చేయనుంది. ఆ డబ్బులు జమ చేసే లోగా 6 నెలలకోసారి వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.
ఎన్నికలకు ముందు జగన్..నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.840 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నారు. నాలుగు విడుతల్లో ఈ రుణమాఫీ చేయనున్నారు.
కానీ రుణం పొందిన మహిళలు తమ బకాయిని చెల్లిస్తూ ఉండాలి. ఆ తర్వాత రోజుల్లో ప్రభుత్వం నుంచి మాఫీ అయిన నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. మండలాలు, పట్టణాల్లో సంబంధిత అధికారులు బ్యాంకుల ద్వారా అర్హులైనా లబ్ధిదారులను ముందుగా గుర్తిస్తారు. అలా గుర్తించిన వారిని ఏపీఎం లాగిన్ ద్వారా సెర్ఫ్‌కు సమాచారం అందిస్తారు. అనంతరం 2019, ఏప్రిల్ 11 నాటికి అప్పు తీసుకున్న డ్వాక్రా సభ్యులకు ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తారు. నాలుగు విడతల్లో లబ్ధిదారులందరికీ రుణ మాఫీ అవుతుంది.