జగన్ రద్దు చేసినా..రాష్ట్రపతి సంతకం వరకూ ‘మండలి’ ఉంటుంది : ప్రొ.నాగేశ్వర్

ఏపీ శాసన మండలి రద్దు..సంచలనం కలిగిస్తోంది. ఈ అంశంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఎవరి తోచిన అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు..ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటల్లోనే తెలుసుకుందాం.
సాధారణంగా శాసన మండలిని రాజ్యసభతో పోలుస్తుంటారు. కానీ అది ఎంతమాత్ర కరెక్ట్ కాదు. రాజ్యసభకు లోక్ సభకు సమానమైన హోదా ఉంది. లోక్ సభతో సమానమైన లెజిస్టేటివ్ పవర్స్ ఉన్నాయి. కానీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం..శాసన మండలి ఉండాలా? వద్దా? అనేది శాసన సభ నిర్ణయం ప్రకారంగా ఉంటుంది. కానీ మండలిని పూర్తిగా రద్దు అనేది పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది.
రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు ఉండే హోదా వేరు శాసన మండలికి ఉండే హోదా వేరుగా ఉంటుంది. రాజ్యసభ అనేది రాష్ట్రాల శాసన సభ వాయిస్ ను వినిపిస్తుంది. అందుకే రాజ్యసభ చైర్మన్ ఉప రాష్ట్రపతి ఉంటారు. కానీ శాసన మండలి చైర్మన్ ఉప గవర్నరర్ గా ఉండరు. కాబట్టి రాజ్యసభతో శాసనమండలికి పోలిక ఎంతమాత్రం లేదు. కానీ ప్రస్తుతం కొంతమంది ఏపీలో రాజ్యసభలాంటి శాసనమండలిని రద్దు చేయటం తగదంటూ చేస్తున్న వాదనలు సరికాదు. రాజ్యసభకు శానసమండలికి ఎటువంటి పోలిక లేదు. అలా వాదించటం అవగామన లేకపోవటమే.
అలాగని శాసన మండలిని శాసన సభ రద్దు చేసినంతమాత్రాన అది చెల్లదు. ఆ తీర్మానం కచ్చితంగా పార్లమెంట్ కు వెళ్లాలి. అక్కడ ఆమోదం పొందాలి.
ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దు చేయటం ద్వారా ప్రక్రియ మొదలైంది.కానీ అది పూర్తికాలేదు. కాబట్టి శాసన మండలి ఉంటుంది. ఈ క్రమంలో శాసన మండలిలో తీసుకున్న నిర్ణయాలను శాసనమండలి ఆమోదం జరగాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో శాసనమండలి రద్దు అయ్యిందని అధికారికంగా అన్ని చర్యలు పూర్తయ్యేంత వరకూ శాసనమండలి కొనసాగుతున్నట్లే.కాబట్టి సభ తీసుకున్న నిర్ణయాలను మండలి ఆమోదించాల్సి ఉంటుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం..The Legislative Assembly Can Overlight the Legislative అని ఉంది. క్లియర్ గా Overlight అనే పదాన్ని గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఏపీ అసెంబ్లీ మండలిని రద్దు చేసేశామని నేతలు సంబరపడిపోవాల్సిన పనిలేదు. మండలి రద్దు పార్లమెంట్ లో ఆమోదం పొందే వరకూ..దానికి రాష్ట్రపతి సంతకం చేసేంత వరకూ మండలి ఉన్నట్లే. ఇది రాజ్యాంగం చెప్పేది. కాదు అనుకుంటే అది వారి అవగాహనారాహిత్యం. మండలి సమావేశాలు జరగకుండా నియంత్రించగలరు కానీ పూర్తిగా ఆపలేరు. మండలిరద్దు పార్లమెంట్ ఆమోదం పొందాలి. రాష్ట్రపతి సంతకం చేయాలి. అప్పటి వరకూ మండలి ఉన్నట్లే..దానికి హక్కులు ఉన్నట్లే.