కండీషన్ అప్లై : ఏపీలో కానిస్టేబుల్స్ రాత పరీక్ష
విజయవాడ : ఏపీలో కానిస్టేబుల్స్ స్ధాయి ఉద్యోగాల భర్తీకి జనవరి 6వ తేదీ ఆదివారం ప్రాధమిక రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని ఏపీ పోలీస్ నియామక మండలి తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.92 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 704 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తొమ్మిది గంటల నుండి పది గంటలలోపు పరీక్ష కేంద్రాలకు అభ్యర్ధులు హజరు కావాలని…పరీక్షకు ఒక్క నిమిషం లేటుగా వచ్చినా వారిని పరీక్ష హాల్లోకి అనుమతించబడదన్నారు. అంతేకాకుండా హాల్ టికెట్‌పై అభ్యర్ది ఫొటో, సంతకం, తప్పనిసరిగా ఉండాలన్నారు. పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ డ్రైవింగ్, లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులో ఒకదాన్ని తీసుక రావాలన్నారు. అంతే కాకుండా బయోమెట్రిక్ విధానంలో అభ్యర్దుల హజరు తీసుకుంటున్నట్లు…అంగ్లం, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు.