శ్రీరాముడిపై అభ్యంతరకర పోస్ట్ పెట్టిన ప్రొఫెసర్ పై FIR నమోదు

శ్రీరాముడిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, మత భావాలను కించపరిచారని ఆరోపిస్తూ అసోం యూనివర్శిలో ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అనింద్య సేన్‌పై సిల్చర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఆగస్టు 5న అయోధ్యలో రామమందిరం భూమిపూజ జరిగిన రోజునే అనింద్య తన ఫేస్‌బుక్‌లో శ్రీరాముడు, ఆయన భార్య సీతను వదిలేసిన సందర్భాన్ని పోస్ట్ గా పెట్టారు. ఆ పోస్టులో ‘జరుగుతున్న ఈ డ్రామా అంతా భార్యను వదిలేసిన ఒక వ్యక్తి కోసమా’ అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు శ్రీరామచంద్రుడిని అవమానించినట్లుగా ఉన్నాయని..ఈ వ్యాఖ్యలు చేసి..ప్రొఫెసర్ అనింద్య సేన్ హిందువుల మనోభావాలను కించపరిచారని ఎఫ్ఐఆర్ నమోదైంది. తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రధానమంత్రి, హోంమంత్రి వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని అవమానించారని ఎఫ్ఐఆర్ నమోదుచేసిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిల్చర్ యూనిట్ అజిటేషన్ ఇంచార్జ్ రోహిత్ చందా అనే యువకుడు ఆరోపించారు.
ఈ మేరకు ఐపీసీ సెక్షన్-295ఎ, 294, 501 కింద అనింద్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తనపై నమోదైన నాన్ బెయిలబుల్ సెక్షన్ గురించి ప్రొఫెసర్ సేన్ తనను తాను సమర్థించుకున్నారు. రామాయణం ఒక ఇతిహాసం మాత్రమే..దీనికి చాలా వెర్షన్లు ఉన్నాయి. వేరు వేరుగా పాయింట్లు వద్ద రాముడిపై విమర్శలు కూడా ఉన్నాయని ఈ విమర్శలను ఎత్తిచూపిన మొదటి వ్యక్తిని నేను మాత్రమే కాదని గతంలో కూడా రాముడిపై ఇటువంటి వ్యాఖ్యలు..విమర్శలు ఉన్నాయని తెలిపారు..ఈ విషయాన్ని గుర్తించాలని అన్నారు.
తనపై కేసు నమోదు అయినక్రమంలో ప్రొఫెసర్ అనింద్య ప్రస్తుతం చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నారు. ‘రామాయణంలో రకరకాల ఎడిషన్లలో శ్రీరాముడు తన భార్య సీతను వదిలేశాడని రాసి ఉంది. రాముడి గురించి వివిధ కోణాల్లో విమర్శలు ఉన్నాయి. అవి చాలా పాతవి.. నేను కొత్తగా ఏం కల్పించి రాయలేదు. హిందూ దేవుడిని అవమానించాలని, ఒక మతం భావాలను కించపరచాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు’ అని తెలిపారు.