బిల్ అడిగినందుకు కేబుల్ ఆపరేటర్ పై కత్తితో దాడి

  • Published By: veegamteam ,Published On : November 17, 2019 / 05:31 AM IST
బిల్ అడిగినందుకు కేబుల్ ఆపరేటర్ పై కత్తితో దాడి

Updated On : November 17, 2019 / 5:31 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. డిష్ బిల్లు అడిగినందుకు కేబుల్ ఆపరేటన్ పై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.నంద్యాల  ఎన్జీవో కాలనీలో చంద్రశేఖర్ రెడ్డి కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన వ్యక్తి కేబుల్ కనెక్షన్ పెట్టించుకున్నాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్ అతనిని కేబుల్ బిల్ అడిగాడు. నన్నే బిల్ అడుగుతావా అంటూ కత్తితో దాడికి దిగాడు.
ఈదాడిలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి చంద్రశేఖర్ ను నంద్యాల హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ దగ్గరకు వచ్చిన పోలీసులు వివారాలు అడిగితెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.