టీడీపీకి SPY రెడ్డి గుడ్ బై : బరిలోకి దిగి.. సత్తా చూపిస్తామంటూ సవాల్

నంద్యాల అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి.. తమ సత్తా చూపిస్తాం అని సవాల్ విసిరారు.

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 01:35 PM IST
టీడీపీకి SPY రెడ్డి గుడ్ బై : బరిలోకి దిగి.. సత్తా చూపిస్తామంటూ సవాల్

నంద్యాల అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి.. తమ సత్తా చూపిస్తాం అని సవాల్ విసిరారు.

కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. టీడీపీ అధిష్టానం నమ్మించి మోసం చేసిందంటూ మీడియా ఎదుట కంటతడిపెట్టారు. నంద్యాల అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి.. తమ సత్తా చూపిస్తాం అని సవాల్ విసిరారు. బ్లాక్ మెయిలింగ్, లాబీయింగ్ తెలియదు కాబట్టే టికెట్ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : డిసైడింగ్ ఫ్యాక్టర్ : జహీరాబాద్ విజేతను నిర్ధారించేది కామారెడ్డి జిల్లా 

ఎన్నికల వేళ వివిధ పార్టీలకు చెందిన నేతలు జంప్ అవుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన వారు వివిధ పార్టీల్లోకి వెళుతున్నారు. నంద్యాల ఎంపీ, అసెంబ్లీ టికెట్లను తమ కుటుంబానికి కేటాయించాలని ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి టీడీపీ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. టీడీపీ సానుకూలంగా స్పందించలేదు. 15 సంవత్సరాలుగా ఎంపీగా సేవలందించి, పేద ప్రజలకు సేవ చేసిన తమ కుటుంబానికి టికెట్ కేటాయించడంలో బాబు అలసత్వం చూపడం బాధించిందన్నారు ఎస్.పి.వై.రెడ్డి. ఎన్నికల బరిలో నిలువకుండా ఆయన్ను టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.