వైసీపీ ఇసుకకి,ఇంద్రధనస్సుకి కూడా రంగులేసేలా ఉంది 

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 06:48 AM IST
వైసీపీ ఇసుకకి,ఇంద్రధనస్సుకి కూడా రంగులేసేలా ఉంది 

Updated On : November 13, 2019 / 6:48 AM IST

వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. దేవాలయాలకు కూడా వైఎస్సార్‌ సీపీ రంగులు వేస్తున్నారని మండిపడ్డారు. అన్నవరంలో అన్యమత ప్రచారం జరిగిందని..మతవ్యాప్తి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరిందనీ ఎద్దేవా చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక బడిని,గుడినీ వదలటం లేదనీ..ఇసుకకి, ఇంద్రధనస్సుకి కూడా వైసీపీ రంగులేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. అన్నవరంలో అన్యమత ప్రచారం, భవానీ ఐలాండ్లో అర్చిపై బొమ్మల ఏర్పాటు,భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు వైసీపీ మతవ్యాప్తిని సూచిస్తున్నాయి అన్నారు కన్నా. 

వైఎస్సార్‌సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటింది. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలతో పాటూ ప్రజల నుంచి విమర్శలపాలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలకు వైఎస్సార్‌సీపీ రంగులు వేసే నిర్ణయంపై టీడీపీ సహా అన్ని పార్టీలు భగ్గుమన్న విషయం తెలిసిందే.