వైజాగ్‌లో విరిగిపడ్డ వేల ఏళ్లనాటి బౌద్ధ స్థూపం

వైజాగ్‌లో విరిగిపడ్డ వేల ఏళ్లనాటి బౌద్ధ స్థూపం

Updated On : October 25, 2019 / 11:24 AM IST

వైజాగ్ లో భారీ వర్షాల కారణంగా పురాతన బౌద్ధ స్థూపం పైభాగంలో పునర్నిర్మించిన గోపురం కైలాసగిరి రోడ్డుపై విరిగిపడింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుండటంతో వెంటనే GVMC(గవర్నమెంట్ ఆఫ్ వైజాగ్ మునిసిపల్ కార్పొరేషన్) సిబ్బంది విరిగిపడిన కొండ చరియలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూశారు. 

అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో ప్రాణనష్టం లేకుండా ముప్పు తప్పింది. మూడు రోజులుగా విశాఖలో భారీ వర్షాలకు కైలాసగిరి రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ స్థూపం 2 వేల సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది. క్రీస్తు పూర్వం 2-3శతాబ్దాల కాలంలో నిర్మించినట్లు సమాచారం. దీంతో చరిత్ర కలిగిన ప్రాచినమైన బౌద్దరామలను పరిరక్షించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిన్నారంటూ బుద్దిస్ట్ సంఘలు ఆందోళన చేపట్టారు.

విశాఖ కలెక్టరెట్ వద్ద చరిత్రక కట్టడాలను పరిరక్షించాలంటూ ఆందోళనకు దిగారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్పిన బాద్యత అందరిపై ఉందన్నారు. పర్యాటకంగా అటు చరిత్ర పరంగా ఎంతో పేరుగాంచిన బౌద్దరామం మహస్థూపానికి పరిరక్షణ లేకుండా పోయిందని కొత్త మెరుగులు దిద్దడం కరువైందని ఆరోపిస్తున్నారు. తొట్లకొండపై ఆక్రమణతో అక్రమ నిర్మణాలు చేయడం. పురవస్తు శాఖ కాకుండా బయటి వ్యక్తులు బౌద్ద స్థూపాలపై పనులు చెయ్యడంతోనే ఇటువంటివి సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.