జగన్ వస్తే ఏపీలో అరాచకమే : చంద్రబాబు

మీ భవిష్యత్ నా  బాధ్యత పేరుతో 2019 ఎన్నికల్లో  ప్రజల్లోకి వెళ్తున్నాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

  • Published By: chvmurthy ,Published On : April 9, 2019 / 01:14 PM IST
జగన్ వస్తే ఏపీలో అరాచకమే : చంద్రబాబు

Updated On : April 9, 2019 / 1:14 PM IST

మీ భవిష్యత్ నా  బాధ్యత పేరుతో 2019 ఎన్నికల్లో  ప్రజల్లోకి వెళ్తున్నాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి: మీ భవిష్యత్ నా  బాధ్యత పేరుతో 2019 ఎన్నికల్లో  ప్రజల్లోకి వెళ్తున్నాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆయన అమరావతి నుంచి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గత 5 ఏళ్లలో చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఆశీర్వదించి  గెలిపించాలని, ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని  చంద్రబాబు నాయుడు అన్నారు.  ప్రభుత్వం చేపట్టిన సంక్షమ కార్యక్రమాల పట్ల ప్రజలుకూడా ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు.   తాను అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది, జగన్ అధికరారంలోకి వస్తే ఎలా ఉంటుందనే విషయం చెపుతూ …  తాను వస్తే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందిని, జగన్ వస్తే  అరాచకాలు పెరిగిపోతాయని హెచ్చరించారు.
Read Also : హిట్లర్ బతికుంటే.. మోడీ చర్యలతో ఆత్మహత్య చేసుకుంటాడు : మమతా

తనకు మళ్ళీ అధికారం ఇస్తే రాష్ట్రానికి మరిన్ని  పరిశ్రమలుతీసుకువస్తానని , జగన్ వస్తే అవన్నీ ఆగిపోతాయని ,గడిచిన 5ఏళ్లోల రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కల్పించిన ఉద్యోగాలను వివరించారు.ప్రత్యేక హోదా, విభజన హమీల అమలు, అమరావతి నిర్మాణం పై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  గతంలో  ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్ లు ప్రదర్శించి మోడీచేసిన మోసాన్ని దుయ్య బట్టారు. 

ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో సోమవారం తెలంగాణ సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా …గతంలో కేసీఆర్, హరీష్ రావు,కవిత లు చేసిన వ్యాఖ్యలను, ఏపీ కి వ్యతిరేకంగా చేసిన  వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు.  పోలవరాన్ని అడ్డుకోటానికి 30 పేజీల అఫిడవిట్, కృష్ణాట్రిబ్యునల్ లో ఏపీకి వ్యతిరేకంగా 74  పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్నిచంద్రబాబు గుర్తు చేసారు. ఏపీకి ఇంత ద్రోహంచేస్తున్నవ్యక్తులతో జగన్ జత కట్టాడని అతనొస్తే కేసీఆర్ ముందు  ఆంధ్రా వాళ్లు తలదించుకుని ఉండాలని చెప్పారు. 
Read Also : అమరావతిపై కేసులు వేసిన జగన్ ఓ ఉన్మాది

పట్టిసీమ నీటిని రాయలసీమకు తరలించి రతనాల సీమ గా మర్చామని చంద్రబాబు చెప్పారు. ఏపీకి 15 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన తెలిపారు.  తద్వారా 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పటికే వచ్చిన పెట్టుబడులతో  కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన తెలిపారు.  రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులున్నుప్పటికీ 200 రూపాయలున్న ఫించను 2000 రూపాయలు  చేశాము. చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు.పట్టిసీమ రాయలసీమకు రత్నాల సీమ చేశామునీళ్లు వచ్చాక  హార్టీ కల్చర్ వచ్చింది, త్వరలో రాయలసీమ హార్టీ కల్చర్ హబ్ గా  మారుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 62 ప్రాజెక్టులు పూర్తి చేశాము, పోలవరం 70శాతం పూర్తి చేశాము.భవిష్యత్తులో 5 నదులు అనుసంధానం చేసిమహాసంగమానికి శ్రీకారం చుట్టబోతున్నాముఅని చంద్రబాబుతెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం  వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అమరావతికి  ఎక్కడా లేని డిమాండ్ పెరిగిందని అన్నారు.మోడీ ,కేసీఆర్, జగన్ ..ముగ్గురు మోడీలు  రాష్ట్రాన్ని  నాశనం చెయ్యలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.ఏపీలో కేసీఆర్ పెత్తనం ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నించారు. పలు సందర్బాల్లో జగన్ చంద్రబాబు  పై చేసిన  తీవ్ర విమర్శలను కూడా ఈ సందర్బంగా ఆయన గుర్తు  చేశారు.  ఆంద్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు తన  బాధ్యత అని ..మరోసారి టీడీపీని గెలిపించమని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 
Read Also : ఏపీలో మైక్ లు బంద్…ఓటరు దేవుడు ఎవరివైపు