ఇసుక సంక్షోభం మానవ తప్పిదమే

ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు జగన్‌ మాయలా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఆర్థిక

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 07:45 AM IST
ఇసుక సంక్షోభం మానవ తప్పిదమే

Updated On : October 29, 2019 / 7:45 AM IST

ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు జగన్‌ మాయలా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఆర్థిక

ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు జగన్‌ మాయలా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం మానవ తప్పిదమేనని తేల్చి చెప్పారు. వైసీపీ నేతల స్వార్థానికి రోజువారీ కూలీలు బలి అవుతున్నారని మండిపడ్డారు.

సొంత ఊళ్లలోని వాగుల్లో ఇసుక తెచ్చుకోవడానికి అనేక అడ్డంకులు సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి-కృష్ణా అనుసంధానాన్ని రివర్స్ చేస్తున్నారని.. జలాశయాలు ఎందుకు నింపలేదని సీఎం ఇప్పుడు ప్రశ్నంచడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్‌, భూమా అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. మరో నేత వల్లభనేని వంశీని అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులతో కోడెలను బలి తీసుకున్నారని వాపోయారు.