మెట్రో నగరాల్లో ఆరోగ్యశ్రీ సేవలు, రూ.10వేలు సాయం
ఏపీ సీఎం జగన్... పాలనలో దూకుడు పెంచారు. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు. ఒకేరోజు పలు కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన

ఏపీ సీఎం జగన్… పాలనలో దూకుడు పెంచారు. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు. ఒకేరోజు పలు కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన
ఏపీ సీఎం జగన్… పాలనలో దూకుడు పెంచారు. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు. ఒకేరోజు పలు కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు.. ఆరోగ్యశ్రీ సేవలు పెంపు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు ఆటో, ట్యాక్సీ వాలాలకు మరో తీపి కబురు చెప్పారు.
వైద్యారోగ్య శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన జగన్.. ఆరోగ్యశ్రీ సేవలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీలో డెంగ్యూతో పాటు ఇతర వ్యాధులను చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకున్న వారికి నెలకు 5వేల చొప్పున ఇవ్వాలని, దీనిని డిసెంబర్ 1నుంచి అమలు చేయాలని సూచించారు. కిడ్నీ, తలసేమియా, హిమోఫిలీయా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి… కదలలేని స్థితిలో ఉండి కుర్చీకే పరిమితమైన వారికి సైతం నెలకు 10వేల రుపాయలను ఆర్ధిక సహాయం చేయాలని సూచించారు. నవంబర్ నుంచి హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూర్ నగరాల్లోనూ ఏపీ ఆరోగ్యశ్రీ సేవలందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ కు 6 సూత్రాలతో ముందుకు సాగాలన్న సీఎం… అన్ని జాతీయ రహదారుల్లో మద్యం దుకాణాలను తొలగించాలని ఆదేశించారు.
అగ్రిగోల్డ్ వ్యవహారంపై కూడా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 20వేల రూపాయల్లోపు డిపాజిట్ చేసిన బాధితులకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మేనిఫెస్టో హామీని నిలబెట్టుకునే దిశగా తొలి అడుగువేశారు. ఇందులో భాగంగా మొదట..10వేల లోపు డిపాజిట్ దారులకు చెల్లింపులు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసం 269.99కోట్ల రూపాయలను మంజూరుచేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం లీగరల్ సెల్ ద్వారా ఈ డబ్బును అగ్రిగోల్డ్ బాధితులకు అందించనున్నారు. దీంతో 3 లక్షల 69వేల 655మందికి ఊరట కలగనుంది.
నిరుద్యోగులను ఆదుకునే విషయంలోనూ జగన్ సర్కార్ ముందడుగు వేసింది. ఇందుకోసం అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా కన్సల్టెన్సీ, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకే రకమైన నిబంధనలు, వేతనాలు వర్తింపజేయాలన్న సీఎం… ఆన్‌లైన్ పద్థతిలో జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. వీరి నియామకాలను పోర్టల్ ద్వారా చేపట్టాలని అధికారులకు సూచించారు.
అంతేకాదు.. ఆటో, ట్యాక్సీ వాలాలకు జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర మార్గదర్శకాలను సవరించారు. గతంలో… ఆటో నడుపుతున్న వ్యక్తి పేరుమీద రిజిస్టర్ అయివుంటేనే ఏటా 10 వేలు ఇస్తామన్న నిబంధనను సడలించి… కుటుంబ సభ్యుల్లో ఆటో రిజిస్ట్రేషన్ ఎవరిపేరిట ఉన్నా… ఆర్థిక సాయాన్ని అందించాలని డిసైడ్ చేశారు.