పసుపు బోర్డ్ కోసం చిత్తశుద్దితో పనిచేశా 

పసుపు బోర్డు సాధన కోసం నిజామాబాద్ ఎంపీగా చిత్తశుద్ధితో పనిచేశారని జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతు..

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 05:03 AM IST
పసుపు బోర్డ్ కోసం చిత్తశుద్దితో పనిచేశా 

Updated On : April 9, 2019 / 5:03 AM IST

పసుపు బోర్డు సాధన కోసం నిజామాబాద్ ఎంపీగా చిత్తశుద్ధితో పనిచేశారని జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతు..

జగిత్యాల : పసుపు బోర్డు సాధన కోసం నిజామాబాద్ ఎంపీగా చిత్తశుద్ధితో పనిచేశారని జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతు.. కల్వకుంట్ల కవిత తెలిపారు. నా శక్తి వంచన లేకుండా అధికారికంగా, రాజకీయంగా చిత్తశుద్ధితో ఒత్తిడి తెచ్చాననీ కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏరకంగాను స్పందించలేదని తెలిపారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోడీ నిజామాబాద్ కు వచ్చిన సమయంలో  పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని  ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదనీ.. పసుపు రైతుల బాధలు తెలుసన్న మోడీ.. ఎన్నికల తరువాత ఆ మాటనే పట్టించుకోలేదని..ఈ విషయంలో నరేంద్ర మోదీ మాట తప్పారని కవిత విమర్శించారు. 

ఈ ఎన్నికల్లో కూడా పసుపు బోర్డు అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టనేలేదన్నారు. కేంద్రం మోసపూరిత మాటలతో ప్రజలను మభ్య పెడుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు గ్రామాల్లోకి వస్తారని ఎద్దేవా చేశారు.  
Read Also : మద్యంపై ఆంక్షలు: 6 మించి అమ్మొద్దు..గీత దాటితే వాతే